జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో రెండు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ భేటీ తరువాత ఢిల్లీలో మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : శిష్యుడు సినిమాపై స్పందించిన సుకుమార్.. ఏమన్నాడంటే ?
Advertisement
ముఖ్యంగా ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి మీటింగ్ అని.. గత రెండు, మూడు రోజులుగా మేము మొత్తం మాట్లాడుకున్నది ఏపీ రాష్ట్రానికి సంబంధించి స్థిరత్వం ఉండాలి. బీజేపీ మెయిన్ ఎజెండా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఈ పొలిటికల్ లైన్ పైనే రెండు రోజుల పాటు చర్చలు జరిపామని చెప్పారు. ఈ విషయంపై చాలా లోతుగా చర్చించాం. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి కేంద్ర నాయకత్వానికి తెలియజేశాం.
Advertisement
పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేశాం. ఈ రెండు రోజులు జరిపిన చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో బలమైన సత్ఫలితాలను తీసుకొస్తాయని భావిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఏపీ పాలన నుంచి విముక్తి కలిగేవిధంగా ముందుకు వెళ్తున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా జనసేన, బీజేపీ లక్ష్యం జగన్ ఓటమి అని.. ఏపీ సీఎం జగన్ నుంచి ఏపీకి విముక్తి కలగాలన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు అంశంపై ఫోకస్ పెట్టాం. పొత్తుల గురించి మాత్రం ఇంకా ఆలోచించలేదు. ఏపీలో అధికారం సాధించేందుకు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 10 సినిమాలు ఇవే..!