సూపర్ స్టార్ కృష్ణ నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు కృష్ణ మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఒకరు. తాజాగా కృష్ణ కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. తనకు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. బంగారు భూమి సినిమాకి నాలుగు ఐదు సీన్లకు డైలాగ్ రైటర్ చేశాను. పి.సీ.రెడ్డి గారు సినిమా ప్రారంభంలో పేరు వేయించుకోమన్నారు. కానీ ఆ సినిమాకి పెదద్ రచయితలు పని చేశారు. వారి పక్కన మా పేరు ఎందుకు అని వద్దన్నామని తెలియజేశారు. ఇందులో ఒక డైలాగ్ ఉంది పద్మ మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు.. మట్టిని నమ్మితే.. మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేయి అనే డైలాగ్ కృష్ణ గారికి చాలాబాగా నచ్చింది. వెంటనే ఈ డైలాగ్ ఎవరు రాశారని అక్కడ ఉన్న వారిని పిలిచి అడిగారని తెలిపారు కృష్ణ .
Advertisement
ఈ విషయం తెలుసుకున్న కృష్ణ బాగా నచ్చి మీరు ఇండస్ట్రీలో పెద్దవారవుతారని తెలియజేశారట. ఎంతో మంది కృష్ణ సహాయం పొందిన వారు ఉన్నారు. నాకు సినిమాలు లేని సమయంలో ఇల్లు కట్టుకోవడానికి తన దగ్గర ఉన్న డబ్బులను ఇచ్చారని గుర్తు చేశారు. అది తీసుకున్న మరుసటి రోజు నుంచే ఇల్లు నిర్మించినట్టు తెలియజేశారు పరుచూరి గోపాల కృష్ణ. అందరికన్న ఎక్కువగా కృష్ణ గారి 54 సినిమాలకు మా కలం ఉపయోగపడిందని గుర్తు చేశారు.
Also Read : కృష ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా చిరంజీవి కొనసాగాడనే విషయం మీకు తెలుసా ?