Home » నీలోఫర్ ఆసుపత్రి, నీలోఫర్ కేఫ్.. వీటిలో “నీలోఫర్” అంటే ఏమిటో తెలుసా..?

నీలోఫర్ ఆసుపత్రి, నీలోఫర్ కేఫ్.. వీటిలో “నీలోఫర్” అంటే ఏమిటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

వాస్తవానికి నిలోఫర్ అంటే తెలుగులో అర్థం నీలి కలువ పువ్వు.. ఆ కలువ పువ్వు లాంటి అందమైన యువరాణి పేరే నీలోఫర్..ఆమె హైదరాబాద్ నిజాం యువరాజు మొజాం ఝా”
మొదటి భార్య నీలోఫర్ .. ఇస్తాంబుల్లో జన్మించి ప్యారిస్ లో పెరిగిన టువంటి ఈ మహారాణి 1931లో పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చింది.. ఆమె ఆ కాలంలోనే పది మంది ప్రపంచ అందగత్తెల లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంటే ఆమె అందం, అభినయం, దయా గుణం ఏ విధంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు.

ఈమెకు చిన్నపిల్లల అన్న, స్త్రీలన్నా చాలా ప్రేమ గౌరవం ఉండేది. మొజాం ఝా” తో వివాహమై 21 సంవత్సరాలు అయినా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ రెండవ భార్యకి ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డ ఆమె కొన్ని రోజుల తర్వాత మొజాం ఝా కు విడాకులు ఇచ్చి డెబ్బై వేల డాలర్ల భరణం తీసుకొని పారిస్ వెళ్లి తన తల్లి దగ్గర సెట్ అయిపోయింది. కానీ భరణం కింద ఆమెకు 25 ఎకరాల భూమి ఇచ్చారు మొజాం ఝా.. ఎంతో దయాగుణం కలిగిన నీలోఫర్ ఆ భూమిని ఏం చేసుకోవాలని భావించింది.

Advertisement

తనకు పిల్లలు లేకపోవడం వల్లనే తన భర్తకు దూరమయ్యానని భావించి, పిల్లలెందుకు కాలేదో కూడా తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఎలాంటి ఆసుపత్రులు కానీ లేవు. ప్రసవం అంటేనే భయపడి పోయేవారు. ప్రసవ సమయంలో తల్లి అయినా, లేక బిడ్డ అయిన ఎవరో ఒకరే బతికేవారు. దీన్ని గమనించిన ఆమె చాలా చలించిపోయింది. అలాగే ఒక రోజు నీలోఫర్ కు ముఖ్య దాసిగా పనిచేసే ఒక మహిళ బిడ్డను కని పురిట్లోనే చనిపోయింది. దీన్ని కళ్లారా చూసిన నీలోఫర్.. ఆమె మరణించడానికి కారణాలు తెలుసుకుంది. దీనికి ప్రధాన కారణం వైద్యసౌకర్యాలు లేకనే ఈ ఘటన జరిగిందని భావించింది.

Advertisement

దీంతో తన మామ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తో మాట్లాడి ప్రస్తుతం హైదరాబాద్ పట్టణంలో ఉన్న రెడ్ హిల్స్ ప్రాంతంలో తనకు భరణంగా ఇచ్చిన 25 ఎకరాల భూమిలో సకల సౌకర్యాలు ఉండేలా ఆసుపత్రి నిర్మించింది. ప్రస్తుతం ఆ ఆసుపత్రి పేరే నీలోఫర్ ఆసుపత్రి.. ఇందులో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అన్నీ అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో వెలసిన టువంటి వివిధ స్టాల్స్ హోటల్స్ కు ఈ పేరు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో నీలోఫర్ ఆసుపత్రి చాలా పేరు గాంచింది. చివరికి నిలోఫర్ పారిస్ లో సినీ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త అయిన ‘ ఎడ్వర్డ్ జూనియర్ పోపు ‘ను 1963 రెండో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. 1989 పారిస్ లోనే తుది శ్వాస విడిచింది.

also read;

సీరియ‌ల్స్ లో క‌ట్టిన చీర‌లు..వేసుకున్న బంగారం ప‌డేస్తారా..?

గీతాఆర్ట్స్ ముందు అర్థనగ్నంగా రోదిస్తున్న మహిళ.. న్యాయం చేయాలని ఆందోళన..!!

 

Visitors Are Also Reading