Home » 20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రియా కి నాగార్జున చేసిన సాయం ఏంటో మీకు తెలుసా ?

20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రియా కి నాగార్జున చేసిన సాయం ఏంటో మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, హీరోయిన్ శ్రియా శరణ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇంతకు వీరిద్దరి కాంబినేషన్ లో ఏయే సినిమాలు విడుదలయ్యాయనే విషయానికొస్తే..  సంతోషం, నేనున్నాను, ఊపిరి, మనం వంటి సినిమాలతో అలరించారు. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Advertisement

నాగార్జున ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ శ్రియా-నాగ్ కాంబో చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఆ సినిమాలు కూడా ఇప్పటికీ గుర్తుండిపోయేవిధంగా నిలిచాయి. శ్రియా ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ శరణ్ నాగార్జున గురించి ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. సౌత్ లో అద్భుతమైన నటులున్నారు. వారిలో నేను నాగార్జునతో కలిసి పని చేశాను. ఆయన నాకు ధ్యానం ఎలా చేయాలో అర్థం అయ్యేవిధంగా నేర్పించారు.

Advertisement

దాని వల్ల ఇప్పటికీనేను నా లైఫ్ లో ప్రతిరోజూ అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతున్నాను అని చెప్పుకొచ్చింది శ్రియా. ఇదే తనకు లైఫ్ లో చేసిన గొప్ప సాయంగా భావించింది. ప్రస్తుతం శ్రియా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. శ్రియ శరణ్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించగా.. నాగార్జున మాత్రం ఇప్పటికీ అదే ఊపుతో సినిమాల్లో హీరోగా నటిస్తూ.. ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

 

 

Visitors Are Also Reading