Home » రాజీవ్ గాంధీ మృతికి మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

రాజీవ్ గాంధీ మృతికి మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

by Bunty
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. అయితే మహేష్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, చాలా సినిమాలు మాత్రం సూపర్ హిట్ సాధించాయి. యువరాజు, వంశీ వంటి డిజాస్టర్ తర్వాత, మహేష్ చేసిన సినిమా మురారి. ఇందులో సూపర్ స్టార్ కు జంటగా సోనాలి బింద్రే నటించింది అయితే రాజీవ్ గాంధీ మృతికి, మురారి సినిమాకు ఓ సంబంధం ఉందట. ఆ సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.

READ ALSO : పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

Advertisement

ఓసారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచి జర్నీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ మృతి అంశం చర్చకు వచ్చింది. వారి కుటుంబంలో ఇప్పటికే చాలా మంది చనిపోయినట్లు చెప్పుకున్నారు. వారి కుటుంబానికి శాపం ఉండటం మూలంగానే వరుస హ**లు జరుగుతున్నాయని అనుకున్నారు. అప్పుడే దర్శకుడి మైండ్ లో ఓ కథ వెలుగు వెలిగింది. శాపంతో కూడిన కుటుంబం పై సినిమా తీయాలి అనుకున్నాడు. అదే మురారి అయింది.

Advertisement

మొత్తంగా ఈ సినిమా స్టోరీని రాసారు కృష్ణవంశీ. మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఈ స్టోరీని ఆయన తండ్రి కృష్ణకు చెప్పాలనుకున్నాడు. ఓ రోజు పద్మాలయ ఆఫీసులో కృష్ణ, మహేష్ బాబుకు కృష్ణవంశీ ఆ కథను వివరించాడు. స్టోరీ వారికి బాగా నచ్చింది. భాగవతం, భారతంలోని క్యారెక్టర్ లను ఈ సినిమా క్యారెక్టర్లుగా రూపొందించాడు కృష్ణవంశీ. అనంతరం ఫైనల్ స్క్రిప్ట్ ను కృష్ణకు చూపించాడు కృష్ణ వంశీ. ప్రొసీడ్ అని చెప్పాడు కృష్ణ. తక్కువ సమయంలోనే ఈ సినిమా పూర్తయింది. 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. ప్రిన్స్ సినిమా కెరీర్ లోనే స్పెషల్ మూవీ అయ్యింది.

READ ALSO : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading