ప్రస్తుతం వేసవికాల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో అందరూ మంచి మంచి మామిడి పండ్లు నోరారా తింటుంటారు. అయితే మామిడిపండ్లలో కొన్ని పుల్లనివి మరికొన్ని తీయనివి ఉంటాయి. పుల్లని మామిడి పండ్లను ఆవకాయ చట్నీ పెట్టుకోడానికి ఉపయోగిస్తారు. అదే తీయని మామిడి పండ్లను జ్యూస్ మరియు కోసుకొని తింటారు. మరి డయాబెటిస్ ఉన్నవారు ఈ తీయని మామిడి పండ్లను తినవచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే టైప్ వన్ డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల, టైప్ 2 డయాబెటిస్ జీవనశైలి అలవాట్ల వల్ల వస్తుంది.
also read:TS Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే…!
Advertisement
షుగర్ వచ్చిందని తెలియగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ ఎప్పటికీ కంట్రోల్ లో ఉంటుంది. తినే ఆహారం విషయంలో కూడా చాలామందికి రకరకాల అనుమానాలు ఉంటాయి. ఈ సమ్మర్ లో విరివిగా దొరికే మామిడి పండ్లు తినవచ్చా.. లేదా అనే అనుమానం కూడా ఎంతోమంది షుగర్ పేషంట్ లో ఉంటుంది. అయితే ఈ మామిడిపండ్లను మితంగా తీసుకుంటే మంచిదే. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవడం షుగర్ పేషెంట్లకు మంచిది.
Advertisement
also read:ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
కొన్ని రకాల పండ్లు తీసుకోవడానికి, ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అదే సంశయం మామిడిపండు విషయంలోనూ ఉంటుంది. వేసవిలో దొరికే ఈ పండు చాలా మంచిది. వీటిల్లో చక్కర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాదిగ్రస్తులు తినవద్దని అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిపండ్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందట. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయని, కాబట్టి మామిడి పండ్లను మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
also read:సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్..కేబినెట్ హోదాతో కీలక పదవి!!