Home » భోజనం చేసిన తరువాత చల్లని ఆహార పదార్థాలను తింటే ఏమవుతుందో తెలుసా ?

భోజనం చేసిన తరువాత చల్లని ఆహార పదార్థాలను తింటే ఏమవుతుందో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా భోజనం చేసిన తరువాత  చాలామంది చల్లని  పదార్థాలను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. భోజనం చేస్తూ.. శీతల పానీయాలు కూడా తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా భోజనం చేశాక కూల్ గా ఉండే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కుల్ఫీలు, కీర్, కూల్ కేక్స్ ని తెగ లాగించేస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్నప్పుడు, రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్ళినప్పుడు ఎక్కువగా తింటారు. కానీ ఇలా భోజనం చేసేటప్పుడు, భోజనం చేసిన తరువాత చల్లని పదార్థాలను తినడం మంచిదా?కాదా..? ఒకవేళ చల్లటి పదార్థాలు తింటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?  నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సాధారణంగా తిన్న ఆహారం జీర్ణం కావాలంటే.. జీర్ణాశయంలో ఎల్లప్పుడూ 100 ఫారన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. ఇలా ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నప్పుడే ఎంజైమ్ లు, జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి.. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. వేడిగా ఉన్న ఆహారం తీసుకుంటే ఇంకా త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది. అందుకే కాస్త వేడిగా ఉన్న ఆహారం తినమంటారు వైద్యులు. అయితే చల్లటి పదార్థాలు తినడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రతలు మారతాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కుల్ఫీలు, కీర్, కూల్ కేక్స్, చల్లగా ఉన్నా పెరుగు, కూలింగ్ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారిపోతాయి..

Advertisement

Advertisement


దీంతో జీర్ణ క్రియ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాతే జీర్ణ క్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా తీసుకున్న ఆహారం పొట్టలో, ప్రేగుల్లో నిల్వ ఉండటం వల్ల పులిసి పోయి.. పొట్టలో చికాకు వస్తుంది. దీంతో బరువు పెరగడం, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అతి చల్లగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading