Home » పెళ్లి తరువాత మొదటి సారి తన భర్త కోసం హన్సిక ఏం వండిందో తెలుసా ?

పెళ్లి తరువాత మొదటి సారి తన భర్త కోసం హన్సిక ఏం వండిందో తెలుసా ?

by Anji
Ad

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా ఆరంగేట్రం చేసిన నటి హన్సిక. తన నటనతో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ. గత ఆదివారం డిసెంబర్ 04 వివాహం జరిగిన విషయం విధితమే. అయితే పెళ్లి బంధంతో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

Hansika Marriage

Hansika Marriage

ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహైల్ కథురియాను పెళ్లి చేసుకుంది హన్సిక. రాజస్థాన్ జైపూర్ లోని ముందోట ఫోర్ట్ ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హన్సిక వివాహానికి హాజరయ్యారు. పెళ్లి తరువాత కూడా హన్సిక సినిమాల్లో నటించనున్నట్టు సమాచారం.  

Advertisement

Advertisement

Also Read :   కేజీఎఫ్ ఫేం యశ్- రాధికల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా ? 

Manam News

ఇప్పటికే హన్సిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నూతన పెళ్లి కూతురు హన్సిక  పెళ్లి తరువాత  మొదటి సారిగా గరిటే పట్టింది. అత్తగారింట్లో భర్త సోహైల్ కోసం ఎంతో ప్రేమగా పెహ్లీ రసోయ్ (హల్వా)ని సిద్ధం చేసిందట. ఈ విషయాన్ని హన్సిక భర్త సోహెల్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హన్సిక పెళ్లి తరువాత తన భర్త కోసం తయారు చేసిన హల్వా ఇప్పుడు వైరల్ గా మారింది. 

Also Read :   అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading