వాహనాలు ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు మనం కలర్ చూసి మరీ కొంటుంటాం. మనకు నచ్చిన కలరో, మనకు ఇష్టమైన వారికి నచ్చిన కలరో ఏదో ఒక కలర్ ఎంపిక చేసుకొని తీసుకుంటాం. కానీ టైర్ల విషయంలో మాత్రం కలర్ ఎంచుకోవడానికి అసలు కుదరదు. ఎందుకంటే టైర్లు కేవలం ఒకే రంగులో మాత్రమే ఉంటాయి. టైర్లన్నీ కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఇంతకు టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వాస్తవానికి తొలుత టైర్లు తెలుపు రంగులో ఉండేవట. రబ్బరు సహజ రంగు కూడా అదే. ఇక టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు మిల్కీ వైట్. మనకు నలుపు రంగు ఏవిధంగా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..? సమాధానం ఏంటంటే.. వాహనం యొక్క బరువును సమర్థించేంత బలంగా అందులో లేదు. దాని బలాన్ని, జీవితాన్ని పెంచడానికి ఒక స్థాపన పదార్థం అవసరం. కార్బన్ బ్లాక్ అనేది మిల్కి వైట్ మెటీరియల్ స్థిరమైన స్థాపన పదార్థంగా గుర్తించారు. మెటీరియల్‌కు కార్బన్ బ్లాక్ జోడించడం వల్ల టైర్ పూర్తిగా నలుపు రంగులోకి మారుతుంది. 1912 తరువాత నుంచే టైర్లకు నలుపు రంగులోకి మార్చారు.
కార్బన్ బ్లాక్ టైర్లకు చాలా కాలం మన్నికతో పాటు బలంగా ఉంటుంది. కార్బన్ బ్లాక్ వాహనంలోని అన్ని భాగాల నుంచి వేడిని తొలగిస్తుంది. వేడి ఉన్నప్పుడు, ఘర్షణ వేడి ఉన్నప్పుడు, టైర్లు కరగవు. చెడిపోకుండా స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా యూవీ రేడియేషన్ నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుంచి టైర్లను రక్షించడంలో కార్బన్ బ్లాక్ సాయపడుతుంది. ఇక మెంటల్ ప్లాస్ నివేదిక ప్రకారం.. టైర్లను తయారు చేసే సహజ రబ్బరు లేత గోధుమ రంగు తెలుపు రంగులో ఉంటుంది. అందుకే తొలుత ఉపయోగించిన టైర్లు కూడా లేత రంగులో ఉండేవి. టైర్‌ను బలంగా చేయడానికి కార్బన్ బ్లాక్ అనేది ఉపయోగించబడింది.
Advertisement
తద్వారా టైర్లు బలంగా ఉంటాయి. కంపెనీలు తరువాత టైర్లను మరింతగా మెరుగుపరిచేందుకు మార్పులు చేసాయి. 1917లో మార్కెట్‌లో బ్లాక్ టైర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ కాలంలో టైర్ల తయారీలో కార్బన్ ఉపయోగించబడింది. ఇలా కార్బన్ ఉపయోగించడం ద్వారా టైర్లు నలుపు రంగులోకి మారాయి. ఇక సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా రబ్బరు టైర్లు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ టైర్‌లో కార్బన్‌ను కలిపితే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంటుంది. దీని కారణంగా టైర్ల తయారీలో సమయంలో కార్బన్ కలుపుతారని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టైర్‌కు కార్బన్ జోడించినప్పుడు ఎక్కువ కాలం పాటు మన్నిక ఉంటుంది. వాహనాలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డుపై గుంతలు లేదా రాళ్లు ఉన్నప్పుడు కార్బన్ కారణంగా టైర్లకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. అందుకోసమే టైర్ల తయారీలో కంపెనీలన్ని కూడా ఈ పద్దతినే వాడుతుంటాయి.
Also Read :
పవన్ కల్యాణ్ కు నో చెప్పిన పూజా..? కారణం అదేనా..!