Home » అన‌సూయ అమెరికాలో ఏం చేసిందో తెలుసా ?

అన‌సూయ అమెరికాలో ఏం చేసిందో తెలుసా ?

by Anji
Ad

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్ర‌స్తుతం ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ తనకు ఉంది. అందుకే అనసూయ అంటే కుర్రాళ్లకు అంత పిచ్చి. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోయిన్ లు కూడా ఆశ్చ‌ర్య‌పోతుంటారు. ఒక యాంకర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనసూయ అంచలంచెలుగా ఎదిగి చివరకు టాప్ రేంజ్ నటిగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు తనను సినిమాలో తీసుకోవడం కోసం దర్శక, నిర్మాతలు తన ముందు క్యూ కడుతున్నారంటే తన రేంజ్ ఏంటో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read : జగన్ ప్రోత్సాహంతోనే వర్మ ‘వ్యూహం’ చిత్రమా ?

Advertisement

Manam

చాలా ఎక్కువ టాలెంట్ ఉన్న నటి, ఎటువంటి పాత్రలో అయినా తను పరకాయ ప్రవేశం చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సృష్టించే నటి ఈమె. ప్రస్తుతం ఫారెన్ చెక్కేసింది అనసూయ. ఇటీవల ఆమె పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల వల్లనే అన‌సూయ విదేశాలకు చెక్కేసిందని తెలుస్తోంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అనసూయ అప్పట్లో అమెరికా వెళ్ళింది. అప్ప‌టినుంచి ఇప్పటి వ‌ర‌కు ఆమె అమెరికాలోనే ఉంది. అమెరికాను చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు అక్కడి ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

Advertisement

Also Read :  సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ

Manam

ఇటీవల అనసూయ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తను పెట్టిన ఏ ఫోటోలలో కూడా తన భర్త భరద్వాజ్ క‌నిపించ‌లేదు. కేవలం అనసూయ మాత్రమే ఉంది. అంటే తన భర్త లేకుండానే ఒంటరిగానే అనసూయ ఫారెన్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తనతో ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియదు. కానీ కొన్ని ఫోటోలలో తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని చూడొచ్చు. అతడు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంటూ కొందరు నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళు ముందు నుంచే ఫ్రెండ్స్ లేక తర్వాత ఫ్రెండ్స్ అయ్యారా? అమెరికాలో ఫ్రెండ్స్ అయ్యారా? అనేది మాత్రం తెలియదు. మొత్తానికి ఏది ఏమైనా అమెరికాలో భర్త లేకున్నా అనసూయ భలేగా ఎంజాయ్ చేస్తోంది అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read :  విక్ట‌రీ వెంక‌టేష్ ఆస్త‌లు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని వేల కోట్లు అంటే.?

 

Visitors Are Also Reading