Home » రోడ్డుపై స్పృహ తప్పిన తల్లిని బతికించుకోవడానికి ఐదేళ్ల చిన్నారి ఏం చేశాడో తెలుసా ?

రోడ్డుపై స్పృహ తప్పిన తల్లిని బతికించుకోవడానికి ఐదేళ్ల చిన్నారి ఏం చేశాడో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా కొన్ని సంఘటనలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మరికొన్నింటి తెలుసుకొని చాలా బాధపడుతుంటాం. అలాగే ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల ఏళ్ల చిన్నారి తన చిన్న చేతులతో తల్లిని బతికించుకోవడానికి పడుతున్న యాతన చూపరులను కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisement

వివరాల్లోకి వెళ్లితే.. రద్దీగా ఉన్న రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని వీల్ చైర్ లో నెట్టుకుంటూ ఐదేళ్ల బాలుడు రద్దీ రోడ్డుపై కాలినడకన తీసుకెళ్లడాన్ని గమనించిన ఓ జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తరువాత తన స్నేహితునికి ఫోన్ చేసి అతని సహాయంతో చిన్నారి తల్లిని రూర్కీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సంఘటన జరిగిన రోజు తల్లికొడుకులు భిక్షాటన చేస్తుండగా.. మహిళ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని బాలుడు వీల్ చైర్ లో తన తల్లిని పిరాన్ కలియార్ లో తాము నివాసం ఉంటున్న గుడిసెకు తీసుకెళ్లేందుకు యత్నించినట్టు బాలుడు తెలిపాడు. 

Advertisement

ముఖ్యంగా ఆ జర్నలిస్ట్ మహిళను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్లనే ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యులు  దృవీకరించారు. అతికష్టం మీద బాలుడు తన తల్లిని వీల్ చైర్ లో తోసుకుంటూ వెళ్తున్న సమయంలో చాలా మంది బాటసారులు అటువైపు వెళ్తున్నప్పటికీ ఒక్కరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి పేరు అబిద్, అతని తల్లి సమా పర్విన్ లుగా గుర్తించారు. 

Also Read :  గూగుల్ కనిపించని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ పేరు.. యువరాజ్ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading