కెసిఆర్ ఓటమి ఎరుగని నాయకుడు కెసిఆర్ ఎంతగానో పోరాటం చేసిన ఉద్యమ ధీరుడు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించారు. ఎన్నో పోరాటాలను కూడా ఆయన చేసారు అలానే కెసిఆర్ ఎన్నో రాజకీయ పదవులను చేపట్టారు, ఆయన జీవితంలో ఓటమి లేదని అందరూ అనుకునేలా చేసారు. ఇవన్నీ చూసి చాలా మంది ఆయన జీవితంలో అసలు ఓటమి లేదని అనుకుంటారు. కానీ నిజానికి కెసిఆర్ కూడా ఓటమి చవి చూశారు. రాజకీయపరంగా ఆయన జీవితంలో కూడా ఓటమి ఉంది.
Advertisement
కానీ చాలామందికి ఈ విషయం తెలియదు ఎప్పుడూ గెలవడమే తప్ప ఓడిపోవడం కేసీఆర్ కి తెలియదు అయితే కేసీఆర్ ని ఓడించింది ఎవరు..? కెసిఆర్ ని ఓడించిన ఆ వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? కేసిఆర్ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతోనే స్టార్ట్ చేశారు తర్వాత ఎన్టీఆర్ హవా గట్టిగా కొనసాగడంతో ఆయన టిడిపిలోకి మారారు అప్పుడు కెసిఆర్ 1983లో సిద్దిపేట తెలంగాణ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేశారు.
Advertisement
మదన్మోహన్ రెడ్డి అనే నాయకుడు చేతిలో ఓడిపోయారు ఆ టైంలో నిజానికి ఎన్టీఆర్ కేసీఆర్ దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తానని చెప్పారు. కానీ ఆయనకి టైం కుదరకపోవడంతో రాలేదు అప్పుడు కేసీఆర్ ఓడిపోవలసి వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కెసిఆర్ కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో మీరు కనిపెట్టగలరా..? ఈ ఫోటోలో ఉన్న నాయకులు ఎవరంటే కెసిఆర్, ఎన్టీఆర్ అలానే మామిడిపల్లి కిషన్ రావు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!