మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చాడు. అభిమానుల కోరిక మేరకు బాస్ ఇస్ బ్యాక్ అంటూ వెండి తెరపై ఇచ్చారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో చిరంజీవికి గత వైభవం ఉంటుందా అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఏకంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసే అందరిని ఆశ్చర్యపరిచింది.
Advertisement
ఆ ఉత్సాహంతోనే వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు చిరు. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి మెగాస్టార్ చిరంజీవి నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఆ సమయంలో చిరంజీవి తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ ఆస్తులలో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు అని, 3 కోట్ల రూపాయల ఆస్తులు చరాస్తులు అని సమాచారం.
Advertisement
ఎన్నికల సమయంలో తన భార్య పేరుపై 6 కోట్ల రూపాయల ఆస్తి ఉందని పేర్కొన్నారు చిరంజీవి. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో 59 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు చిరంజీవి పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆస్తులు ఉన్నాయని చిరంజీవి ఆ సమయంలో వెల్లడించారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పలు వ్యాపారాలతో బిజీగా ఉండటంతో పాటు, ఆ వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.
READ ALSO : నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?