చాలా మందికి కాాకాసుర వృత్తాంతం గురించి తెలియకపోవచ్చు. రామాయణంలోని సుందర కాండలో కాకసురుడి గురించి వివరించబడింది. హనుమంతుడు అశోకవనంలో సీతను దర్శించిన సమయంలో.. సీత క్షేమంగానే ఉన్నదనే వార్తను శ్రీరాముడికి తెలియజేయడానికి తిరిగి వెళ్లే ముందు తాను ఆమెను చూసి వచ్చినందుకు గుర్తుగా ఏదైనా శ్రేష్టమైన అభిజ్ఞానం చెప్పమని సీతాదేవిని అడిగాడట. అప్పుడు సీతాదేవి పూర్వం చిత్రకూటంలో జరిగిన కాకాసుర వృత్తాంతం గురించి రాముడికి చెప్పాల్సిందిగా హనుమంతుడికి చెబుతుంది.
Advertisement
చిత్ర కూటంలో నివసించేటప్పుడు మందాకినీ తీరంలో సీత రాముడి అంకంలో కూర్చొని ఉండగా.. మాంసంపై ఆసక్తిగల తీరంలో ఓ కాకి వచ్చి ఆమెను స్తమ మద్యంలో పొడుస్తుంది. ఆమె మట్టి పెళ్ల విసిరి దానిని నివారించడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ కాకి ఆమెను పొడచడం మానలేదట. రాముడు అది చూసి ఆమెను కాస్త పరిహసిస్తాడు. మళ్లీ ఆ కాకి రక్తం స్రవించేటట్టు ఆ దేవిని పొడుచుతుంది.
Advertisement
Also Read : ఈ నల్లని పండ్లు ఆ వ్యాధులకు అద్భుతమైన అవకాశం..!
ఆ విషయాన్ని గమనించిన రాముడు కోపించి ఒక దర్బపోచను తీసుకొని బ్రహ్మాస్త్రంతో దానిని సంయోజనం చేసి కాకిపై ప్రయోగిస్తాడు. అందుకు భయపడి కాకి పలు దిశలకు ఎగిరిపోతుంది. కానీ దర్బపోచ దానిని వదలకుండా వెన్నంటుతుంది. ముల్లోకాలు తిరిగి ఎక్కడ రక్షణ పొందలేక మరల వచ్చి వాయ సంతుదకు రాముడే శరణు వేడుతుంది. అప్పుడు రాముడు దానిపై దయ తలిచి దాని ప్రాణాలు తీయకుండా కుడి కన్నును మాత్రం హరిస్తాడు. కాకి రాముడికి నమస్కరించి తన ఆవాసానికి వెళ్లి పోతుంది.
Also Read : మినపప్పు వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!