నయనతార విఘ్నేష్ శివన్ గత కొద్ది సంవత్సరాల కాలం నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు. వీళ్లిద్దరూ జూన్ 09న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు తమిళనాడుకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యగా రజినికాంత్, మణిరత్నంతో పాటు షారూఖ్‌ఖాన్ వంటి ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. స్వతహాగా దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ గురించి తెలుగు ప్రేక్షకులకు నయనతార ప్రియుడుగానే కాకుండా.. ఓ దర్శకునిగా మాత్రమే తెలుసు. ఇక విఘ్నేష్ శివన్ గురించి షాకింగ్ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వీరు ఏడేళ్లుగా ప్రేమించుకున్న ఎట్టకేలకు ఒకటయ్యారు. నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఏడాది చిన్న. వీరి పెళ్లి హిందు సంప్రదాయం ప్రకారం జరిగింది. నయనతారను పెళ్లి చేసుకోకముందు ఆమెకు విఘ్నేష్ పెద్ద అభిమాని. ఆయన మల్టీ టాలెండెట్ పర్సన్ కూడా. ముఖ్యంగా విఘ్నేష్ శివన్ దర్శకుడు కాకముందు పాటల రచయితగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తమిళంలో ఈయన 50కి పైగా పాటలు రాశారు. ఈయన లిరిక్స్ అందించిన పాటలకు అనిరుథ్ రవిచందర్ సంగీతమందించారు. అనిరుథ్‌కు ఇతను బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు అనిరుథ్ సంగీతం అందించడం విశేషం.
ఇతను సాహిత్య కారుడే కాదు.. కెరీర్ ప్రారంభంలో పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు సంగీతం కూడా అందించాడు. అప్పట్లో అవి ప్రేక్షకాదారణ పొందాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడిదాన్ సినిమాలో తొలిసారి నయనతార నటించింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమాను తెలుగులో నేను రౌడినే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఆ తరువాత రౌడిపిక్చర్స్ అనే సంస్థను నేత్రికన్, కుజంగల్ వంటి చిత్రాలను నిర్మించారు విఘ్నేష్ శివన్. లిరిస్ట్‌గా, సంగీత దర్శకునిగా, దర్శకునిగా, నిర్మాతగా సత్తా చాటిన విఘ్నేష్ శివన్ రాఖీ అనే యాక్షన్ చిత్రంతో విడుదల చేసారు. అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో మంచి లాభాలు పొందాడు. యాక్టర్‌గా కూడా సత్తా చాటారు విఘ్నేష్ శివన్.
Advertisement
సీవీ, పోడా పోడి వంటి చిత్రాలతో ఈయన తన యాక్టింగ్‌తో అదుర్స్ అనిపించారు. పోడాపొడి చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు కావడం విశేషం. దర్శకునిగా పోడా పోడి, నానుమ్ రౌడిదాన్, తానా సెరినా కొట్టం, పావ కాదయిగల్, కాతు వాకుల రెండు కాదల్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసారు. ఇక ఈ సినిమాకు విఘ్నేష్ రైటర్‌గా పని చేసారు. తాన సెరిందా కొట్టం సినిమా తెలుగులో సూర్య హీరోగా గ్యాంగ్ పేరుతో విడుదలై మంచి విజయాన్నే అందుకున్నది. సూర్య, కీర్తి సురేష్ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించారు. కాతువాకుల రెండు కాదల్ సినిమా తెలుగులో కన్మణి రాంబో కతిజా పేరుతో విడుదల అయింది. తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా, నయన్, సమంత హీరోయిన్లుగా నటించారు.
ఇక విఘ్నేష్ శివన్ ఫ్రెండ్స్ విషయానికొస్తే.. విజయ్ సేతుపతి, శింబు, అనిరుద్, సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతార ఇతను చాలా దగ్గరయ్యారు. ముఖ్యంగా రాజా రాణి చిత్రం నుండి నయనతార మళ్లీ పుంజుకోవడానికి.. ఆమె లేడీ సూపర్ స్టార్‌గా ఎదగడంలో ఇతని కృషి ఎంతో ఉంది. వీరిద్దరూ ప్రేమలో పడిన తరువాత నయనతారకు సంబంధించిన అన్ని విషయాలను విఘ్నేష్ దగ్గర ఉండి చూసుకునేవాడట. నయన్ ఏ సినిమాలోనైనా నటించాలంటే తొలుత ఈ కథ విఘ్నేష్‌కు నచ్చితేనే నయన్ దగ్గరకు వెళ్లేది. అప్పుడు కానీ సెట్స్ పైకి వెళ్లేది కాదు. నయనతారతో పెళ్లి విఘ్నేష్ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి దాదాపు ఏడేళ్లకు పైగా ఎదురు చూసి మరి పెళ్లి చేసుకున్నాడట.
Also Read :
భర్తలకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లే భార్యలు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
సుకుమార్ భార్య పోస్ట్.. మన పెళ్లి సక్సెస్ కావడానికి కారణం అదే అంటూ..!