Home » వారానికి ఏడు రోజులుడాల‌నే ప్ర‌శ్న వెనుక ర‌హ‌స్య‌మేమిటో తెలుసా..?

వారానికి ఏడు రోజులుడాల‌నే ప్ర‌శ్న వెనుక ర‌హ‌స్య‌మేమిటో తెలుసా..?

by Anji
Ad

వారం అన‌గా ఏడు రోజులు అని మ‌నందిరికీ తెలిసిందే. చిన్న‌పిల్లాడిని అడిగినా వారానికి ఏడు రోజులు ఉంటాయని చెప్పేస్తాడు. ఆదివారం ద‌గ్గ‌ర నుంచి శ‌నివారం వ‌ర‌కు మొత్తం ఏడు వారాలున్నాయి. అస‌లు వారానికి ఏడు రోజులు ఎందుకు ఉంటాయి..? ఐదు రోజులు లేదా ఆరు రోజులు ఉండ‌వ‌చ్చు క‌దా..అనే అనుమానం వ‌చ్చిందా..? అయితే వారంలో ఏడు రోజులు మాత్ర‌మే ఎందుకు ఉండాలి. అది ఎలా నిర్ణ‌యించారు..? ఎవ‌రు నిర్ణ‌యించార‌నే విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం.

వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వెనుక ఇంత రహస్యం దాగుందా..

Advertisement

వాస్త‌వానికి వారానికి ఎన్ని రోజులు ఉండాల‌నే విష‌యంపై చాలా మంది అధ్య‌య‌నం చేసారు. ఖ‌గోళంలో ఉండే గ్ర‌హాలు,సూర్య‌చంద్రుల క‌ద‌లిక‌ల ఆధారంగా ర‌క‌ర‌కాల తీర్మాణాలు చేప‌ట్టారు. ఈ ప‌రిశోధ‌నలో భాగంగా బాబిలోన్ ప్ర‌జ‌లు అంటే ప్ర‌స్తుతం ఇరాక్ ప్ర‌జ‌లు ఖగోళ గ‌ణ‌నాల‌లో అప్ప‌ట్లో చాలా నైపుణ్యం, అభివృద్ధి చెందారు. వాస్త‌వానికి వారానికి 7 రోజులు అనే కాన్సెప్ట్‌తో వారే ముందుకు వ‌చ్చార‌ని ఓ ప్ర‌ముఖ ప‌త్రిక వెల్ల‌డించింది.

వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వెనుక ఇంత రహస్యం దాగుందా..

Advertisement

ఖ‌గోళంలో ఉన్న గ్ర‌హ క‌ద‌లిక‌ల నుంచి ఏడు రోజులను ఒక‌వారం లాగా ప‌రిశోధ‌కులు స్వీకరించారు. అన‌గా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, వీన‌స్‌, మార్స్‌, బృహ‌స్ప‌తి గ్ర‌హాల క‌ద‌లిక‌ను వారు గ‌మ‌నించి.. చంద్రుడి 28 రోజుల క‌క్ష ఆధారంగా వారానికి 7 రోజులు, నెల‌కు నాలుగు వారాలు నిర్ణ‌యించారు. ఈ స‌మ‌యంలో ఈజిప్ట్ రోమ్‌ల‌లో ఎనిమిది లేదా 10 రోజులుండేవి. అలెగ్జాండ‌ర్ మాత్రం భార‌త‌దేశంలో గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. ఆవిధంగా వారానికి ఏడు రోజులు అనే భావ‌న భార‌త‌దేశానికి వ్యాపించింది.

వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వెనుక ఇంత రహస్యం దాగుందా..

ఆ తరువాత చైనా దేశం కూడా మ‌న‌ల్ని అనుస‌రించి ఏడు రోజుల వారాన్ని ప్రారంభించార‌ట. వారానికి ఏడు రోజులు మాదిరిగా కొన్ని గ్ర‌హాల పేర్లు పెట్టారు. రోమ్‌లో ఈ విష‌యం గురించి చాలా ప్ర‌యోగాలు జ‌రిగాయి. ఇస్లాం జుడాయిజం ప్ర‌జ‌లు వారానికి 6 రోజులు ప‌ని చేసి మిగిలిన ఒక‌రోజు మ‌త‌ప‌ర‌మైన ప‌నుల కోసం కేటాయించ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంద‌రికీ అదే వ‌ర్తిస్తున్న‌ది. దీని త‌రువాత ఒక్కో గ్ర‌హానికి ఒక‌రోజు నిర్వ‌హించారు. ఒక్కోరోజుకు ఒక్కొ గ్ర‌హం పేరు పెట్టారు. శ‌ని, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, సూర్యుడు అనే గ్ర‌హాలు ఒక్కోరోజు పెట్టార‌న్న మాట‌. అయితే కొన్ని వారాల పేర్లు మ‌రాఠీ భాష‌లో ఉండ‌డం గ‌మనార్హం.

Visitors Are Also Reading