Home » టాలీవుడ్ టాప్ హీరోల రెమ్మున‌రేష‌న్ ఇప్పుడు ఎంతో తెలుసా?

టాలీవుడ్ టాప్ హీరోల రెమ్మున‌రేష‌న్ ఇప్పుడు ఎంతో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోల పారితోషికం చాలా త‌క్కువ గా ఉండేది. ఎక్కువ లో ఎక్కువ రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల కు మించి ఉండేది కాదు. అయితే ప్ర‌స్తుతం తెలుగు సినిమాలు ఇండియాలో నే కాకుండా ప్రపంచ వ్యాప్తం గా ఆద‌ర‌ణ పెర‌గ‌డం తో హీరోల రెమ్యూన‌రేష‌న్ విప‌రీతం గా పెరిగింది. కొన్ని సంవ‌త్స‌రాలలోనే హీరోల రెమ్యూన‌రేష‌న్ దాదాపు 10 రేట్ల కు పైగా పెరిగింది.

star-heros-remuneration

star-heros-remuneration

ప్ర‌స్తుతం హీరోలు రూ. 10 కోట్ల కు రూ. 20 కోట్ల కు ఎవ‌రూ కూడా సినిమాలు చేయ‌డం లేదు. భారీ రెమ్యూన‌రేష‌న్ ల‌తో సినిమాలు చేస్తున్నారు. క‌రోనా వంటి మ‌హ‌మ్మారి వ‌చ్చినా.. వీరి రెమ్యూన‌రేష‌న్ కు కొతలు ప‌డ‌టం లేదంటే వీరి డిమాండ్ ఎంత‌గా ఉందో మ‌నం అర్థం చేసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలుగా చెలామ‌ణి అవుతున్న కొంత మంది హీరోల రెమ్యూన‌రేష‌న్ ఎలా ఉందో ఇప్పుడు చూద్ధం.

Advertisement

1) ప్ర‌భాస్ : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ను పాన్ ఇండియా స్టార్ చేసిన బ‌హుబ‌లి సినిమా నుంచి ప్ర‌భాస్ రెమ్మున‌రేష‌న్ భారీగా పెంచాడు. ప్ర‌స్తుతం అయ‌న ఒక్కో సినిమా కు దాదాపు రూ. 100 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నాడు.

2) ప‌వ‌న్ క‌ళ్యాణ్ : ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత దూకుడు గా సినిమాలు చేస్తున్నాడు. అయితే రాజ‌కీయాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న వ‌కీల్ సాబ్ అనే సినిమా ను చేసాడు. అయితే ఆ సినిమా కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ. 50 కోట్ల వ‌ర‌కు రెమ్మున‌రేష‌న్ తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న అన్ని సినిమా ల‌కు అదే రెమ్మునరేష‌న్ తీసుకుంటున్నాడు.

Advertisement

3) మ‌హేశ్ బాబు : ప్రిన్స్ మ‌హేశ్ బాబు కూడా భారీ గానే పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయ‌న చేసే సినిమా ల‌కు న‌ష్టం అనేది ఎక్కువ రాదు. కాబ‌ట్టి రెమ్యున‌రేష‌న్ విష‌యం లో ప్రిన్స్ త‌గ్గ‌డ‌ని తెలుస్తుంది. ఆయ‌న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట సినిమా కు మ‌హేశ్ బాబు ఏకంగా రూ. 55 కోట్లు తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.

4) తార‌క్ : జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న సినిమా ల‌కు భారీగానే రెమ్మున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. తాజా గా ఆర్ఆర్ఆర్ సినిమా కు ఎన్టీఆర్ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం.

5) రామ్ చ‌ర‌ణ్ : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీ కి వ‌చ్చి కొద్ది రోజులు అవుతున్నా.. ఫాలోయింగ్ మాత్రం ఎక్కువ గానే ఉంటుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న సినిమా కు రూ. 60 కోట్లు తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.

6) అల్లు అర్జున్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కు రూ. 55 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.

అలాగే చిరంజీవి ఆచార్య కు రూ. 50 కోట్లు, బాల‌కృష్ణ అఖండ కు రూ. 11 కోట్లు, నాగార్జున బంగార్రాజు సినిమా రూ. 10 కోట్లు, విజ‌య్ దేవ‌ర కొండ లైగ‌ర్ సినిమా కు రూ. 10 కోట్లు తీసుకుంటున్నారు.

Also read: బాలకృష్ణ షోకు గెస్ట్ గా మహేష్ బాబు.. ఇక రచ్చ రచ్చే

Visitors Are Also Reading