‘వాల్తేరు వీరయ్య’ వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన తదుపరిచిత్రం ‘బోళా శంకర్’లో కనిపించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. హీరో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘వేదాళం’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ‘బోళా శంకర్’ ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానున్నట్టు మేకర్స్ ఇటీవలె ప్రకటించారు.
READ ALSO : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?
Advertisement
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చిరుకి చెల్లెలుగా నటి కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, 1980లో ఎం.రాజశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ‘పున్నమినాగు’ చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నాగులు పాత్రలు నటించారు. అయితే చిరంజీవి సరసన పూర్ణిమ పాత్రలో మేనక నటించింది. ఈ మేనక ఎవరో కాదు, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ తల్లి. మేనక అయ్యంగార్ కన్యాకుమారిలోని నాగర్ కోయిల్ లో జన్మించారు.
Advertisement
READ ALSO : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం
ఆమె 1979లో తమిళ చిత్రం ‘రమాయి వయసుక్కు వస్తుట్టా’ తో సిని అరంగేట్రం చేసింది. 1980 నుంచి 1987 వరకు ఆమె మొత్తం 125 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో ‘పున్నమి నాగు’లో నటించారు. ఆ తర్వాత 1982లో ‘సుబ్బారావు కోపం వచ్చింది’ సినిమాలో దుర్గా పాత్రలో కనిపించారు. నటిగానే కాకుండా నిర్మాతగా మేనక పలు చిత్రాలను నిర్మించారు. ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో తల్లి మేనక హీరోయిన్గా నటించగా…కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది.
READ ALSO : శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?