Home » బాహుబలి మూవీ లో ఆ సాంగ్ లో కనిపించిన అమ్మాయికి రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

బాహుబలి మూవీ లో ఆ సాంగ్ లో కనిపించిన అమ్మాయికి రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు. రాజమౌళి కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి హీరో, హీరోయిన్ నటీనటులు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపును సాధించారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు రుచి చూపించారు రాజమౌళి. అలాంటి రాజమౌళి చేసిన బాహుబలి సినిమా వచ్చి చాలా ఏళ్ళు అవుతోంది. కానీ ప్రతిరోజు ఈ సినిమా గురించి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బాహుబలి సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడ్డారు.

Advertisement

Also Read:చనిపోయినా నన్ను వదలేరేమో….నటి యమున ఎమోషనల్ కామెంట్స్…!

రాజమౌళినే కాదు ఈ చిత్ర నిర్మాణానికి తన కుటుంబం మొత్తం కృషి చేశారని చెప్పవచ్చు. రాజమౌళి భార్య రమా రాజమౌళి, తన కొడుకుతోపాటు, తన కజిన్స్ తో పాటు సన్నిహితులంతా ఇందులో వర్క్ చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈ బాహుబలి సినిమాలో తన కూతురు మయూకా కూడా నటించిందని చాలామందికి తెలియదు. మయూక రాజమౌళి రమా దంపతులకు దత్తపుత్రిక. ఛత్రపతి సినిమా టైంలో చిన్న పాపగా ఉన్న మయూకని దత్తత తీసుకున్నారట రాజమౌళి.

Advertisement

Also Read:వార‌సుడు సినిమాపై ప‌రుచూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

అయితే మయూక బాహుబలి 2 చిత్రంలో ని సాహోరే బాహుబలి సాంగ్ లో రావణ కాష్టం తర్వాత ప్రభాస్ పై పూలు చల్లుతారు. పూల వర్షం కురిపించే పిల్లలలో మయూక కూడా ఉంది. మయూక ఈ సినిమానే కాదు విక్రమార్కుడు మూవీలో కూడా కనిపించింది. అప్పుడు చాలా చిన్న పాప. ఆ చిత్రంలోని కాలేజీ పాపల బస్సు సాంగులో ఫ్రూటీ తాగే ప్యాకెట్ ను విసిరేసే పాప మయూకనే. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ విధంగా రాజమౌళి కూతురు సినిమాలలో కూడా నటించింది.

Also Read:జ‌బ‌ర్దస్త్ ఆర్పీ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..? ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లుసుకున్నారంటే..?

Visitors Are Also Reading