టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు. మరొక వైపు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి విప్లవాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటూ ఆయన రూటే సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ దృవాల మాదిరిగా ఈ హీరోల మధ్య ఓ విచిత్రమైన బంధం ఉందనే చెప్పవచ్చు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు ఇంకా రాణిస్తూనే ఉన్నారు. ఇక ఆర్.నారాయణ మూర్తి మాత్రం ఏదో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
Advertisement
Advertisement
మహేష్ బాబు బాల్య వయసులో ఉండగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ చిత్రంలో నటుడిగా తొలిసారి మేకప్ వేసుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆర్.నారాయణ మూర్తి కూడా దాసరి నారాయణరావు తెరకెక్కించిన నీడ చిత్రంలో నటించారు. దాసరి శిష్యుడిగా, నటుడిగా రంగ ప్రవేశం చేసి.. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటారు ఆర్.నారాయణమూర్తి. ఇలా వీరిద్దరూ కలిసి నాలుగు దశాబ్దాల క్రితమే ఒకే సినిమాలో కలిసి నటించడం విశేషం. ఇక వీరిద్దరినీ వెండి తెరకు పరిచయం చేసింది కూడా గురువు గారు దాసరి నారాయణరావు.
తెలుగు సినీ చరిత్రలో దాసరి నారాయణరావు ఓ బ్రాండ్ అనే చెప్పాలి. తనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకులలో దాసరి ఒకరు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. మోహన్‌బాబు, మహేష్‌బాబు, శ్రీహరి, ఆర్.నారాయణమూర్తి, ఈశ్వర్రావు, అన్నపూర్ణ, వక్కంతం వంశీ, సుమ, దాసరి నారాయణరావు రెండవ కుమారుడు అరుణ్‌కుమార్ వంటి వారందరూ దాసరి దర్శకత్వంలో ఆరంగేట్రం చేయడం విశేషం.
Also Read :
యాంకర్ దేవి నాగవల్లి ఆర్థిక కష్టాల గురించి మీకు తెలుసా..?
ఆచార్య ప్లాప్ అని బాధ పడుతున్న “చిరు ఫాన్స్” అందరికి రాసిన ఆ లెటర్ ! ఆయన చెప్పింది నిజమేకదా ?