Home » వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ గా మారడానికి కారణం ఏంటో తెలుసా ?

వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ గా మారడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీ అంటే అది ఒక మాయాలోకం. అక్కడ నెగ్గుకు రావాలంటే.. చాలా టాలెంట్ ఉండాలి. లేదంటే కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వముండాలి. కమిట్మెంట్స్ ఇవ్వాలి. ఇక హీరోయిన్ గా రాణించాలంటే మామూలు విషయం కాదు. ఎంత అందం, టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్ గా రాణించడం మాత్రం అంత ఈజీ కాదు. చాలా మంది ఎన్నో కలలు కని.. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వస్తుంటారు. అందుకు తగ్గట్టుగా కష్టపడరు. ఫిజిక్ ని మెయిన్ టెన్ చేయరు. ఇలా చేయడం వల్ల హీరోయిన్ కావాల్సిన వారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. చివరికీ వాళ్లు స్టార్ కూతుర్లు అయినా.. ఇంకెవ్వరైనా అందం, అభినయం ఉంటే మాత్రం చాలదు. అన్నింటిని తట్టుకోగలిగిన వారే  రాణించగలుగుతారు.

Advertisement

హీరోయిన్ అవుతామని చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అందరూ హీరోయిన్ కాలేరు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా స్టార్ హీరోయిన్ అవుదామనే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ వాస్తవానికి తను శరత్ కుమార్ కూతురుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా తను చేసిన సినిమాలు చాలా తక్కువనే. హిట్ సినిమాలు తక్కువగా ఉండడంతో.. వరలక్ష్మీ హీరోయిన్ రోల్స్ కాకుండా విలన్ పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపింది. తనకు విలన్ గా చాలా అవకాశాలున్నాయి. కొన్ని సినిమాల్లో విలన్ గా నటించింది. తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో8 కూడా విలన్ పాత్రనే పోషించింది వరలక్ష్మీ శరత్ కుమార్.

Advertisement

Also Read : వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

Manam News

హీరోయిన్ చేయాల్సిన వారు విలన్ గా ఎందుకు చేస్తున్నారని ఓ యాంకర్ ప్రశ్నించగా.. అందుకు వరలక్ష్మీ ఈ విధంగా సమాధానం చెప్పింది. హీరోయిన్ గా రాణించాలంటే.. గ్లామర్ గా ఉండాలని.. గ్లామర్ గా లేకపోతే హీరోయిన్ గా అవకాశాలు రావడడం చాలా కష్టం. అలాంటి తలనొప్పులు నేను భరించలేను. అందుకే విలన్ రోల్స్ చేసుకుంటున్నా అంటూ వరలక్ష్మీ షాకింగ్ కామెంట్లు చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో వరలక్ష్మీకి పెద్ద సినిమాల్లో విలన్ గా చేసే అవకాశాలు వస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతోంది. 

Also Read :  టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందుగా అనుకున్నది తనని కాదా… మరెవరినో తెలుసా?

Visitors Are Also Reading