సాధారణంగా కొన్ని సినిమాలు కొంత మంది చేస్తేనే బాగుంటాయి. మరికొందరూ చేస్తే అవి అంతగా సెట్ అవ్వవు. అప్పట్లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కలిసి సినిమాలు చేస్తే ఆ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. వాళ్ల యాక్టింగ్ తో ఆ సినిమాలను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెల్లేవారు. ఇదిలా ఉంటే.. అప్పట్లో చిరంజీవి, బాలయ్యలతో మల్టీస్టారర్ మూవీ చేయాలని చాలా మంది దర్శకులు ప్లాన్ చేశారు.
కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక సందర్భంలో కమర్షియల్ సినిమాల కంటే కూడా వీరిద్దరినీ కలిపి పౌరాణిక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంజునాథ చిత్రంలో చిరంజీవి శివుడిగా.. అర్జున్ భక్తుడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తొలుత అర్జున్ క్యారెక్టర్ ని బాలయ్య బాబుతో చేయించాలని దర్శకుడు రాఘవేంద్ర రావు అనుకున్నారట. కానీ బాలయ్య ఆ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడట. ఫైనల్ గా అర్జున్ తో ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ ని చేయించారు.
Advertisement
Advertisement
మొత్తానికి ఈ సినిమా ఓ డీసెంట్ హిట్ మూవీగా మిగిలింది. ఆ క్యారెక్టర్ ని బాలకృష్ణ కాంబోలో మల్టీస్టారర్ మూవీగా భారీ కలెక్షన్లు వసూలు చేసేదని అప్పట్లో చాలా మంది సినీ మేధావులు సైతం వారి అభిప్రాయాలను వెల్లడించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా బాలయ్య-చిరంజీవి కాంబినేషన్ లోమల్టీస్టారర్ మూవీ అయితే రాలేదు. ఆ సినిమా వస్తే చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చిరంజీవి తనయుడు రామ్ చరణ్-నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ కలిసి RRR మూవీలో నటించారు.
Also Read : వకీల్ సాబ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణమేంటో తెలుసా ?