Home » చైనా దేశం వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడరో తెలుసా ?

చైనా దేశం వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడరో తెలుసా ?

by Bunty
Ad

ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ప్రాముఖ్య‌త ఉన్న క్రిడాల‌లో క్రికెట్ ఒక‌టి. క్రికెట్ పై ఈ మ‌ధ్య కాలంలో చాలా దేశాలు ఫోక‌స్ చేస్తున్నాయి. గ‌తంలో ఎక్కువ పాపులర్ కాక పోవ‌డంతో చాలా దేశాలు క్రికెట్ పై పెద్ద‌గా ఆస‌క్తి చూప లేదు. కానీ ప్ర‌స్తుత కాలంలో క్రికెట్ పై ప్ర‌పంచ వ్యాప్తం గా అభిమానులు పెరిగిపోతున్నారు. క్రికెట్ ను ఇండియా తో పాటు ప‌లు దేశాలు ఎక్కువ ఆడుతాయి. అయితే మ‌న ప‌క్క‌న ఉన్న చైనా మాత్రం క్రికెట్ పై పెద్ద ఆస‌క్తి చూప‌లేదు. అయితే చైనా దేశం క్రికెట్ ను ఆడ‌టానికి ఎందుకు ఆస‌క్తి చూప‌లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చైనా వాళ్ల మొఖాలు అంద‌రివీ స‌మానంగా ఉంటాయి. అవుట్ అయిన‌ప్పుడు అంప‌ర్ క‌న్వ్యూజ్ అవుతారు అంటు సిల్లీ గా కాకుండా పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.


చైనా పాపులేష‌న్ ఎక్కువ గా ఉంటుంది. దీని వ‌ల్ల అంద‌రూ చ‌దువు పై దృష్టి పెట్టకుండా ఆట‌ల‌పై కూడా దృష్టి పెట్టేవారు. అయితే అప్ప‌ట్లో ఒలంపిక్స్ లో ఎక్కువ ప్రాముఖ్య‌త ఉన్న ఆట‌ల‌పైనే చైన దేశం ఎక్కువ ఆసక్తి చూపింది. వాటిలో చైనా నుంచి గొల్డ్ మెడల్స్ కొడితే ప్ర‌పంచం మొత్తం చైనా వైపు చూస్తుంద‌ని అనుకున్నారు. అయితే ఆ కాలంలో ఒలంపిక్స్ లో క్రికెట్ లేదు. అలాగే క్రికెట్ అప్పుడు అంతా ప్రాముఖ్య‌మైన ఆట కాదు. అందుకే వాళ్లు క్రికెట్ పై ఫొక‌స్ చేయ‌కుండా.. ఒలంపిక్స్ లో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న ఆట‌ల‌పైనే ఆస‌క్తి చూపారు. వాళ్ల దేశస్థుల‌కు కూడా ఆ క్రిడాల‌పైనే కోచింగ్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు కూడా ఒలంపిక్స్ లో చైనా వాళ్ల‌కే ఎక్కువగా గోల్డ్ మెడ‌ల్స్ వ‌స్తుంటాయి.

Advertisement

Advertisement


అలాగే ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న దాదాపు దేశాలు అన్నీ కూడా బ్రిటీష్ పాల‌నలో ఉన్నాయి. అయితే బ్రిటీస్ వాళ్లకు ఇష్ట మైన క్రిడా క్రికెట్. దీంతో బ్రిటీష్ పాలించే అన్ని దేశాల్లో క్రికెట్ ను ప‌రిచ‌యం చేశారు. అయితే చైనా దేశంలో బ్రిటీష్ పాల‌న లేదు. దీంతో చైనా వాళ్ల‌కు ముందుగా క్రికెట్ గురించి తెలియ‌దు. కేవ‌లం బ్రిటీష్ పాల‌నలో ఉన్న దేశాల‌కే క్రికెట్ గురించి తెలుసు. అలాగే బ్రిటీష్ భార‌త్ తో పాటు మ‌రికొన్ని దేశాల‌కు స్వాతంత్య్రం ఇచ్చిన త‌ర్వాత కూడా 1998 కామ‌న్ వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను ఆడించారు. దీంతో ప‌లు దేశాల‌కు క్రికెట్ పాకింది. కాగ ప్ర‌స్తుతం క్రికెట్ ఫేమ‌స్ కావడంతో చైనా తో పాటు అమెరికా వంటి దేశాలు కూడా క్రికెట్ ఆడ‌టానికి ముందుకు వ‌స్తున్నాయి.

read more.. వామ్మో..! ఎంత పెద్ద చేప.. 750 కేజీలు

Visitors Are Also Reading