Home » సాగరసంగమం సినిమాలో ఎస్పీ శైలజ డ్యాన్స్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ?

సాగరసంగమం సినిమాలో ఎస్పీ శైలజ డ్యాన్స్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లిగా సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలాగే నటిగా, డ్యాన్సర్ గా అందరికీ సుపరిచితురాలు అయిన ఎస్పీ శైలజ గురించి తెలిసిందే. కళా తపస్వీ కె.విశ్వనాథ్ ఇటీవల మరణించడంతో ఆయన గురించి తలుచుకుంటూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సాగర సంగమం చిత్రంలో నటించిన శైలజ ఎలా నటించారు..? విశ్వనాథ్ గారు శైలజకి ఆ పాత్రకు తీసుకెళ్లడానికి కారణాలు ఏంటనేది ఆమె వివరించారు. 

Advertisement

క్లాసికల్ డ్యాన్స్ ప్రారంభమవుతున్న సమయంలోనే ఆ సమయంలోనే చూసిన విశ్వనాథ్ ఆయన తరువాత చేయబోతున్న సాగర సంగమం చిత్రంలో జయప్రద కూతురు పాత్రకు సరిగ్గా సరిపోతానని భావించారు అంటూ చెప్పింది శైలజ. ఆ సినిమా పాటలు పాడటమే ఇష్టమని తన తండ్రి నటిస్తానంటే ఒప్పుకోరని భావించి ముందుగానే తాను నటించనని విశ్వనాథ్ గారికి చెప్పేసిందట శైలజ. విశ్వనాథ్ గారిని అన్న అని పిలిచే శైలజ ఆయన ఎంత అడిగినా కాదనేసరికి బాలుగారికి కూడా చెప్పి చూశారట. అయినా ఒప్పుకోకపోవడంతో వేరే ఆమె పాత్రను చూడాలనుకున్నప్పటికీ.. మళ్లీ విశ్వనాథ్ బాలుగారి తండ్రి వద్దకు వెళ్లి శైలజను నటించమని చెప్పండి అని అడిగారు.  

Advertisement

Also Read :  బిగ్ బాస్ 7లోకి యాంకర్ రష్మీ…. రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

మీరు నా ముందు సినిమాలను చూస్తారు కదా నేను తనను చక్కగా చూపిస్తాను అని అడగడంతో బాలుగారి తండ్రి ఒప్పుకొని శైలజ గారికి అనుమతి ఇచ్చారు.  మొదటి సీన్ రవీంద్ర భారతిలో షూటింగ్ కమల్ హాసన్ ముందు డ్యాన్స్ చేయాల్సిన సీన్, ఆ సమయంలో ఆయన ముందు నా డాన్స్ ఏంటి నేను చేయను అంటూ భయపడ్డానని చెప్పుకొచ్చింది శైలజ. అందరూ నవ్వుతారు సరిగ్గా చేయకపోతే అని నిర్మాత ఏడిద నాగేశ్వరావుతో చెప్పేశారట. దీంతో కంగారు పడిన నిర్మాత విశ్వనాథ్ వద్దకు వచ్చి అసలు విషయం చెప్పేశారట. అవునా శైలజ వద్దకు వచ్చి మొదట ఒక సీన్ చేద్దాం అందరూ నిన్ను చూసి నవ్వితే ఇక ఆపేద్దామని ధైర్యం చెప్పి మరీ చేయించారట. 

Also Read :  సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ నాగబాబు మాత్రం చేయడం లేదట.. ఎందుకో తెలుసా ? 

Visitors Are Also Reading