Home » కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

కోవై సరళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యనటిగా మంచి గుర్తింపు పొందింది. బ్రహ్మానందం కోవై సరళ కామెడీ అంటే ఒక బ్రాండ్ ఉందని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించి కామెడీ పండించారు. అలాంటి కోవై సరళ నటిగా మంచి గుర్తింపు పొందింది కానీ, జీవితంలో అనేక ఇబ్బందులు పడి పెళ్లి కూడా చేసుకోలేదు. దానికి కారణాలు ఏంటో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

1979లో ఆర్ కృష్ణ గారు డైరెక్షన్ చేసిన వెళ్లి రత్నం అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చాలా చిన్న పాత్ర చేసిన మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ముందని ముగించు అనే తమిళ చిత్రంలో గర్భిణి స్త్రీగా నటించింది. ఇక అప్పటినుంచి ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. 1987 ఏళ్ల మోహన్ బాబు నటించిన వీర ప్రతాపం సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోవై సరళ ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్టార్డం తెచ్చుకుంది. ఇండస్ట్రీలో కోవై సరళ బ్రహ్మానందం కామెడీ మాటల్లో చెప్పలేము. అలాంటి కోవై సరళ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమైంది.

Advertisement

ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ అయిపోయారు. మాలాంటి వాళ్లకు ఆఫర్లు తగ్గాయని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది. తన కుటుంబం, తన అక్క, చెల్లెళ్ల కోసం పెళ్లి చేసుకోలేదని అక్క చెల్లెలు అందరినీ విదేశాల్లో సెటిల్ చేశానని చెప్పుకొచ్చింది.తను సంపాదించిన డబ్బు మొత్తం కుటుంబానికే ఖర్చు చేశానని, మా సిస్టర్స్ పిల్లల కోసమే డబ్బంతా ఖర్చయిపోయిందని ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఉన్న కొంత ఆస్తి కోసం కుటుంబ సభ్యులు నాపై కోర్టులో కేసు వేశారని చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Anasuya : పెళ్ళికి ముందు 8 ఏళ్ళు అతనితో అనసూయ సహజీవనం…కులం కూడా తెలియదట !

Sadha : ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..!

Visitors Are Also Reading