సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరనే వార్త వినడానికే వినసొంపుగా లేదు. వెండితెర రారాజు మరణించడం తెలుగు సమాజాన్ని దు:ఖ సాగరంలో నింపింది. సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ అంతా విషాదంలో మునిగిపోయింది. సోమవారం కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని చెప్పిన వైద్యులు కండీషన్ ను పర్యవేక్షించారు. 48 గంటల తరువాత కండీషన్ చెప్పగలమని వెల్లడించారు వైద్యులు.
Advertisement
గుండెపోటుకు గురైన కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతి గంటకూ కుటుంబ సభ్యులతో చర్చిస్తూ వైద్యం అందించినట్లు వెల్లడించారు. కిడ్నీలు, గుండె, మెదడు డ్యామేజ్ సహా శరీరంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి 7గంటల సమయంలో ఆయనకు చికిత్స ఫలించదని నిర్ధారించామని చెప్పారు. రాత్రి మళ్లీ పరిస్థితి విషమించడంతో చికిత్సను అందించామన్నారు. దాదాపు 9 ఏళ్ల నుంచి కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయనతో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కృష్ణ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
Advertisement
ప్రజల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అభిమానులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ మరణ వార్త తెలుసుెకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇక కృష్ణ మృతికి సంతాపంగా గురువారం చిత్ర పరిశ్రమలకు సెలవు ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, గవర్నర్ భిశ్వభూషణ్ నివాళులర్పించారు.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ ని ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడని ఎందుకు అంటారో తెలుసా ?