సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడిగా అనిపించుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు. ఇక చాలామంది అమ్మాయిలు తమకు వచ్చే భర్త మహేష్ బాబు లా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లుక్స్ తో అందర్నీ మైమరిపించే మహేష్ బాబు గురించి తాజాగా ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో అయినా రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్ గా చేసిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది.
Advertisement
మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఈవెంట్ ని అట్టహాసంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్లో మంత్రి మల్లారెడ్డి స్పీచ్ చాలా వైరల్ అయింది. అయితే మహేష్ బాబు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక సింపుల్ టీ షర్టు ధరించి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ సింపుల్ టి షర్టు ధ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు అంత సింపుల్ గా కనిపించే ఆ టీషర్ట్ కాస్టు వేలలోనే ఉందట.
Advertisement
ఇక ఆ టీషర్టు ధర ఎంత అంటే అక్షరాల 47 వేలట. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు నోరెళ్ళబెడుతున్నారు. మహేష్ బాబు వేసుకున్న ఆ సింపుల్ టీషర్ట్ ధర మరీ అంత ఎక్కువ అని మాట్లాడుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు కాళ్ళకు వేసుకునే చెప్పుల నుండి చెవులకు పెట్టుకునే కమ్మల వరకు ఇలా ప్రతి ఒక్కటి చాలా లగ్జరీవే వాడుతారు.ఇక మహేష్ బాబు వేసుకున్న టీ షర్టు అంటే ధర ఆ మాత్రం ఉంటుంది అంటూ ఈ విషయం తెలిసిన నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!