Telugu News » Blog » బాలయ్య టాక్ షోలో బాహుబలి వేసుకున్న షర్టు ధర ఎంతో తెలుసా..?

బాలయ్య టాక్ షోలో బాహుబలి వేసుకున్న షర్టు ధర ఎంతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

నందమూరి నరసింహ బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రస్తుతం విజయవంతంగా ముందుకు వెళుతుంది. ఈ షోకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఈ షోకు వచ్చిన గెస్టులను బాలయ్య చేసే ఇంటర్వ్యూ మామూలుగా ఉండటం లేదు. తాజాగా ఈ షో కి సంబంధించిన ఐదవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రెడీ చేశారు నిర్వాహకులు. తాజాగా జరిగిన ఎపిసోడ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ లు వచ్చారు.. అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోలు తాజాగా ఓ టీజర్ ప్రోమో ను ఆహా రిలీజ్ చేసింది.

Advertisement

also read:చాలా స్లిమ్ గా మారి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా ?

అయితే ఈ ప్రోమోలో హీరో ప్రభాస్ ఒక కలర్ షర్టులో కనిపించారు. ఆయన ఈ షోకు ఎంట్రీ ఇచ్చిన విధానం సినిమా ఈవెంట్ కు ఏ మాత్రం తీసుకోకుండా గ్రాండ్ గా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య ఇద్దరు హీరోలతో ఓ రేంజ్ లో సందడి చేశారు. బాలకృష్ణ, ప్రభాస్ ని తన దగ్గరికి రమ్మని పిలిస్తే భయపడుతూ వెనక్కి వెళ్ళినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది.. ఇవన్నీ పక్కన పెడితే ఈ షోలో అన్నిటికంటే హాట్ టాపిక్ గా కనిపించింది ప్రభాస్ వేసుకున్న షర్టు.. దీని గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. ప్రభాస్ ఈ షో కోసం మల్టీ కలర్ షర్టును వేసుకున్నారు.. ఆయన వేసుకున్న షర్టు ప్రముఖ బ్రాండ్ రాల్ఫ్ లారెన్ కు చెందింది..

Advertisement

దీని ధర కూడా దాదాపుగా 15000 ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన రేంజ్ పెంచుకున్న ప్రభాస్ ఇలాంటి షర్టు వేసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.. మరి అప్పటి వరకు ఎపిసోడ్ ను హోల్డ్ లో పెడతారా లేక దీనికి ముందే స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి..

Advertisement

also read: