హైదరాబాద్ నగరాన్ని పరిపాలించిన నిజాం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎనిమిదో నిజాం రాజు ముకర్రం జా బహదూర్ అని పిలువబడే మీర్ బర్కత్ అలీ ఖాన్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 1933 అక్టోబర్ 06న ఫ్రాన్స్ లో ఒట్టోమన్ సామ్రాజ్యపు యువరాజు ఆజంజా, యువరాణి దుర్రు షెహ్వార్ లకు బర్కత్ అలీఖాన్ జన్మించారు. భారత యూనియన్ లో హైదరాబాద్ చేరిన తరువాత ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా పని చేసారు. ఏప్రిల్ 06, 1967న ఎనిమిదో అసఫ్ జా గా పట్టాభిషేకం చేయబడ్డాడు.
Advertisement
Advertisement
ఎనిమిదో నిజాం అయినటువంటి బర్కత్ అలీఖాన్ హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కి మనవడు. ఇతని తల్లి టర్కీ చివరి సుల్తాన్ కుమార్తె. ఈయనకు 20 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలోనే తల్లి షెహ్వార్ మరణించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నిజాం రాజు భారత్ ని వదిలి విదేశాలలో స్థిరపడ్డారు. ఇతను టర్కీలోని ఇస్తాంబుల్ నివాసం ఉంటున్నారు. ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ (ముకర్రం జా) 89 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. జనవరి 17న హైదరాబాద్ కి భౌతికకాయాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చౌహమల్లా ప్యాలెస్ లో ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నిజాం చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో జనవరి 17, 2023న నిర్వహించనున్నారు.
Also Read : ఎలిజబెత్ -II పెళ్లికి నిజాం నవాబ్ గిప్ట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా..?
హైదరాబాద్ ని పరిపాలించిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తరువాత వారసుడిగా బర్కత్ అలీఖాన్ ని ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఈయన 8వ నిజాంగా ప్రసిద్ధి చెందారు. 1971 వరకు ముకర్రం జా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలువబడుతూ వచ్చారు. 1971లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పదవులు, బిరుదులు అన్ని రద్దు అయ్యాయి. హైదరాబాద్ లోనే తన తాత, తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే తన అంత్యక్రియలు నిర్వహించడమే తన చివరి కోరిక అని కుటుంబ సభ్యులకు చెప్పడంతో హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Advertisement
Also Read : అప్పట్లో యాదగిరి గుట్టకు నిజాం నవాబు ఎంత విరాళమిచ్చాడో తెలుసా?