Home » అధికంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమో తెలుసా ?

అధికంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆందోళన, దడపుట్టడం, ఆ తర్వాత క్రమంగా గుండెపోటుకు కూడా కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రోజుకు ఆరు కప్పుల కాఫీ తాగితే.. మెదడుకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

  • రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే హాని కలుగుతుంది. ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదు. కాఫీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడంతో పాటు గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. అడ్రినలిన్ స్థాయిలను పెంచి ఆందోళనను కలిగిస్తుంది. కాపీ ఎక్కవ తాగడం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. కెఫిన్ ఉన్న కాఫీని తాగడం వల్ల మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగడంతోపాటు.. జీవక్రియ, శారీరక పనితీరుపై దుష్ప్రభావం చూపుతుంది.
  • చాలా మంది ఉదయాన్నే కప్పు కాఫీ తాగనది ఉండలేరు. అయితే.. కాఫీ ఉదయాన్నే తాగితే.. గ్యాస్ట్రిన్ విడుదలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపులో ఉత్పత్తి చేసే హార్మోన్ వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. జీర్ణాశయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల కడుపులో వికారం, గ్యాస్, మంట లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల రొమ్ములో చిన్న చిన్న గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాఫీ వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మనికి, జుట్టుకు మంచిది కాదు.
  • అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల కలిగే ఉద్దీపన ప్రభావాలు మీ గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. దీంతోపాటు కాఫీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి రక్తపోటును అమాంతం పెంచుతుంది. అందుకే గుండెపోటు, బీపీ ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
  • అధిక మోతాదులో కాఫీ తీసుకోవడం వల్ల ఏకాగ్రతను, ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది. అడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి బీపీని పెంచుతుంది. కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయి. కాఫీ కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాఫీ బీపీని పెంచడమే కాకుండా కొన్ని సార్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కాఫీ తగ్గిస్తుంది.
Visitors Are Also Reading