Home » స‌మ‌ర‌సింహారెడ్డిలోని ట్రైన్ సీన్‌కు వంగ‌వీటి – దేవినేని గొడ‌వ‌ల‌కు సంబంధం ఏమిటో తెలుసా..?

స‌మ‌ర‌సింహారెడ్డిలోని ట్రైన్ సీన్‌కు వంగ‌వీటి – దేవినేని గొడ‌వ‌ల‌కు సంబంధం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఫ్యాక్ష‌న్ సినిమాలు వ‌చ్చాయి. వాటిలో చాలా వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అయి బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేశాయి. ముఖ్యంగా ఫ్యాక్ష‌న్ సినిమాకు గ్లామ‌ర్ తీసుకొచ్చింది మాత్రం బాల‌కృష్ణ అనే చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ తొలి సినిమాగా శార‌ద న‌టించిన క‌డ‌ప రెడ్డెమ్మ అయితే ఆ త‌రువాత విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన ప్రేమించుకుందాం.. రా.! సెకండ్ హాఫ్‌లో ఫ్యాక్ష‌న్ బ్యాక్ గ్రౌండ్ చూపించిన‌ప్ప‌టికీ ఆ సినిమాలోని ల‌వ్‌స్టోరీ దానిని డామినేట్ చేసేసింది. కానీ 1998 లో అంతఃపురంలో మాత్రం కృష్ణ‌వంశీ కాస్త ముందుకెళ్లి ఫ్యాక్స‌నిజాన్ని కొంచె ప‌రిచ‌యం చేసిన‌ప్ప‌టికీ ఇవేవి కూడా ఫ్యాక్సనిజానికి గ్లామ‌ర్ తేలేక‌పోయాయి.

Advertisement

 

1990లో లారీ డ్రైవ‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. దీనికి బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. ఆ స‌మ‌యంలో ఓ రోజు రాత్రి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌లిశారు. అప్ప‌టికే ఆయ‌న నాగార్జున హీరోగా న‌టించిన జాన‌కిరాముడు చిత్రానికి క‌థ అందించారు. అది బిగ్గెస్ట్ హిట్‌. ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌ను క‌లిసి కొన్ని క‌థ‌లు వినిపించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఆయ‌న‌కు క‌థ‌లు న‌చ్చ‌క‌పోయినా ఈయ‌న క‌థ‌లు చెబుతూనే ఉన్నారు. ఈ త‌రుణంలోనే వీరి మ‌ధ్య కాస్త ఎక్కువ సాన్నిహిత్యం ఏర్ప‌డింది. 1997లో కూడా వ‌రుస‌గా మూడు క‌థ‌లు ద‌ర్శ‌కుడు బి.గోపాల్ కు చెప్పారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. ఏవీ ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. వీరి మ‌ధ్య సాన్నిహిత్యం త‌గ్గింది. ఓ రోజు అనుకోకుండా తోట రామ‌కృష్ణ అనే ఓ కో డైరెక్ట‌ర్ బి.గోపాల్‌ను క‌లిశారు.

అప్ప‌టికే బి.గోపాల్‌కు వ‌రుస‌గా 6 ఫ్లాప్ సినిమాలున్నాయి. దాదాపు ఆయ‌న పెద్ద హీరోల సినిమాలు చేయ‌డం లేదు. ఎవ‌రైనా ఇంటికి వ‌స్తే కాసేపు క‌బుర్లు చెబుతూ కాల‌క్షేపం చేసేవారు బి.గోపాల్. అలా వీరి మ‌ధ్య సంభాష‌ణ‌లో విజయేంద్ర‌ప్ర‌సాద్ గోపాల్ ను అడిగారు. మీకు న‌చ్చిన పాత సినిమా ఏమిటి అని..? అప్పుడు గోపాల్ గుండ‌మ్మ క‌థ అని స‌మాధానం చెప్పారు. గుండ‌మ్మ క‌థ‌కు రాజేష్ క‌న్నా న‌టించిన దుష్మ‌న్ క‌లిపితే ఎలా ఉంటుంద‌ని అడిగారు. అప్పుడు గోపాల్ త‌ర్జ‌న ప‌డ్డారు. ఈ రెండింటిని ఎలా క‌లుపుతార‌ని.. అప్పుడే విజ‌య‌నేంద్ర ప్ర‌సాద్‌కు సిందూర‌పువ్వు క‌థ గుర్తుకు వ‌చ్చింది.


ఫ‌స్ట్ హాప్ గుండ‌మ్మ క‌థ‌లోని వంట‌వాడు. సెకండ్ హాఫ్ సిందూర‌పువ్వులోని ప్లాష్‌బ్యాక్, ప‌గ ప్ర‌తికారాల‌తో ముగిసిపోయే దుష్మ‌న్ చెప్పిన‌ట్టుగానే వారం త‌రువాత క‌థ సిద్ధం చేసి బి.గోపాల్ కు అంద‌జేశారు. ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ముంబ‌యి మాఫియా నేప‌థ్యంలో సినిమా చేద్దామ‌ని స‌ల‌హా ఇచ్చారు. అదే స‌మ‌యంలో మాట‌ల ర‌చ‌యిత ఏ.ఎం.ర‌త్నం రాయ‌ల‌సీమ నేప‌థ్యం తీస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. ముఖ్యంగా రైల్వే స్టేష‌న్‌లో ఎదురు ప‌డిన సంఘ‌ట‌నను ర‌త్నంగారి నిజ‌జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌ను చేర్చారు. అదేమిటంటే విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి, దేవినేని కుటుంబం వారు ఒకేసారి రైలు దిగారు. వారి కోసం వ‌చ్చిన వారు ఎదురు ప‌డ్డారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను స్వ‌యంగా చూసిన ర‌త్నం ఇందుకు అనుగుణంగా స‌న్నివేశాల‌ను రాసుకున్నారు.

Also Read : గ‌జిని సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Advertisement

 

ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌, ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, నిర్మాత చెంగ‌ల వెంక‌ట్రావు చెన్నైకి వెళ్లి బాల‌కృష్ణ‌కు క‌థ చెప్పారు. బాల‌య్య క‌థ విని రెండు రోజుల్లో చెబుతాను అని చెప్పారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారికి ప్రాజెక్ట్ సెట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం లేక బ‌య‌టికి వెళ్లిపోయారు. బి.గోపాల్‌, నిర్మాత వెంక‌ట్రావు అక్క‌డే అలా కూర్చుని ఉండిపోయారు. అంత‌లోనే బాల‌కృష్ణ గోపాల్‌ను మీకు ఎలా ఉంది క‌థ అని అడిగారు. రాయ‌ల‌సీమ‌లో ఎన్టీఆర్‌కు ఎన‌లేని ఆద‌ర‌ణ ఉంది. మీరు అన్న కూడా రాయ‌ల‌సీమ వారికి చాలా ఇష్టం. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో మీరు సినిమా చేస్తున్నారు. అది ఒక ప్ల‌స్ పాయింట్‌. ముగ్గురు హీరోయిన్లున్నారు. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ బ్ర‌హ్మాండంగా ఉంది. హీరోయిజం బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింద‌ని గోపాల్ చెప్పారు. వెంట‌నే ఇంకెందుకు ఆల‌స్యం చేసేద్దాం అని బాల‌య్య చెప్పారు.

ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలోని అందాల ఆడ‌బొమ్మ సాంగ్ కోసం దాదాపు 18 చ‌ర‌ణాలు రాశార‌ట సీతారామ‌శాస్త్రి. అవేమి న‌చ్చ‌లేదంట డైరెక్ట‌ర్ బి.గోపాల్‌కు చివ‌ర‌గా అందాల ఆడ‌బొమ్మ న‌చ్చింద‌ట దానిని ఫైన‌ల్ చేశార‌ట‌. అది ఇప్ప‌టికీ హిట్ సాంగే కావ‌డం విశేషం. ముఖ్యంగా స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో బాల‌య్య న‌ట‌న అద్భుతం అనే చెప్పాలి. ఇత‌ర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే బాల‌య్య స‌మ‌ర సింహారెడ్డి సినిమా స‌మ‌యంలో ప్ర‌స్తుత ఏపీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బాల‌కృష్ణ ఫ్యాన్స్ అసోసియేష‌న్‌కు నాయ‌కుడు. బాల‌కృష్ణ సినిమాలు అంటే జ‌గ‌న్‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ సినిమాలో బాల‌య్య చెప్పే డైలాగ్లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

వాస్త‌వానికి బాల‌కృష్ణ‌కు భైర‌వ ద్వీపం త‌రువాత బాల‌కృష్ణ‌కు ఆ స్థాయిలో హిట్ ప‌డ‌క అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. ఈ సినిమాలో బాల‌య్య చెప్పే డైలాగ్‌ల‌కు ఈల‌లు, గోల‌లు, క‌లెక్ష‌న్ల క‌న‌కాభిషేకం కురిపించింది. అప్ప‌ట్లోనే 14 కోట్ల‌కు పైగా డిస్ట్రిబ్యూట్ చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది స‌మ‌ర‌సింహారెడ్డి. 32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. సల్మాన్‌ఖాన్ న‌టించిన హ‌మ్ ఆప్‌కే హైన్ కౌన్ సినిమా రికార్డుల‌ను క్రాస్ చేసింది. 73 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి సౌత్ ఇండియా సినిమాగా చ‌రిత్ర‌కెక్కింది. రాయ‌ల సీమ‌లో 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న మొద‌టి చిత్రం. అదేవిధంగా రాయ‌ల‌సీమ‌లో 8 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. సిల్వ‌ర్ జూబ్లీ చేసుకుంది ఈ సినిమా.

క‌ర్నాట‌క‌, పులివెందుల‌, గుంటూరు, మాచ‌ర్ల‌, కృష్ణ‌, ప్రకాశం, ముఖ్యంగా గుడివాడ‌ల‌లో సిల్వ‌ర్ జూబ్లీ చేసుకుంది ఈ చిత్రం. గుడివాడ‌లో సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకున్య‌న అతి కొద్ది సినిమాల‌లో ఇది ఒక‌టి. అంత‌కు ముందు దేవ‌దాస్‌, పెళ్లిసందడి, త‌రువాత స‌మ‌ర‌సింహారెడ్డి కావ‌డం విశేషం. సమ‌ర‌సింహారెడ్డి త‌రువాత సింహాద్రినే సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రం రికార్డులు చాలానే ఉన్నాయి. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా క‌లెక్షన్లు ఇప్ప‌టి ధ‌ర‌ల‌క‌నుగుణంగా పోల్చి చూస్తే దాదాపు 350 కోట్ల‌కు స‌మానం. బాల‌య్య బాక్సాఫీస్ స్టామిన ఇది.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు 

Visitors Are Also Reading