Home » Soudarya-anushkashetti: సౌందర్య-అనుష్క మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో మీకు తెలుసా..?

Soudarya-anushkashetti: సౌందర్య-అనుష్క మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించిన హీరోయిన్ సౌందర్య. ఈమె మరణానికి ముందు ఎన్నో సినిమాల్లో నటించి,లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. తన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు తీసింది. అలాంటి సౌందర్యకు మరియు ప్రస్తుత హీరోయిన్ అనుష్క శెట్టికీ మధ్య చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 2009 జనవరిలో విడుదలైన అనుష్క శెట్టి అరుంధతి సినిమా అంటే తెలియని వారు ఉండరు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

Advertisement

also read:మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

Advertisement

అప్పటికి ఎన్నో గ్లామర్ పాత్రలు చేస్తూ వస్తున్న అనుష్క శెట్టి ఒక్కసారిగా అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో ఆమెకు బాగానే పేరు దక్కింది. తర్వాత అనుష్క లేడీ ఓరియంటెడ్ కథలు క్యూ కట్టయి అనుకోండి. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ .. అరుంధతి సినిమాకు సౌందర్య చేసిన ఆ సినిమాకు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. అరుంధతి చిత్రాన్ని సౌందర్య ఎప్పుడో చేసేసింది. కథ మాత్రం వేరు వేరు. 1999లో అరుంధతి టైటిల్ తోనే సౌందర్య ఒక మూవీ చేసింది. దర్శకుడు క్రాంతికుమార్ డైరెక్షన్ చేశారు. అమ్మ ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుతుంది.

ఇది కూడా లేడీ ఓరియంటెడ్ పాత్రనే. ఈ చిత్రంలో సౌందర్య తన పాత్రతో అదరగొట్టింది. దీనికి ఎం ఎం కీరవాణి సంగీతం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. శ్రీవిద్య సౌందర్య తల్లికూతుర్లుగా చేశారు. కథ బాగానే ఉన్నా కానీ మితిమీరిన ఓవర్ డ్రామా వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మొత్తానికి అనుష్క మరియు సౌందర్య ఓకే టైటిల్ తో మూవీ చేశారు. ఇందులో అనుష్క సక్సెస్ అయితే సౌందర్య ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading