సాధారణంగా ప్రతీ ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటారు. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే మాత్రం గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడతే మంచి ఫలితం ఉంటుందట. గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టులు వెల్లడించారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల గాడిద పాలతో సబ్బులను తయారు చేసి అమ్ముతుంటారు. ఈ సబ్బులు వాడితే అందంతో పాటు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు అని ఆ కంపెనీ చెబుతోంది.
Advertisement
పూర్వ కాలంలో ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేదట. గాడిద పాలను స్నానానికి వినియోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని చర్మ సంరక్షణ కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను అమ్ముతోంది. గాడిద పాల వల్ల చర్మానికి వృద్ధాప్యం రాదు అని పేర్కొంటున్నారు. చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. చర్మం మృదువుగా తయారు అవుతుంది.
Advertisement
అందుకే ఇప్పుడు గాడిద పాలతో తయారు చేయబడిన సబ్బులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారట. గాడిద పాలలో యాంటి బ్యాక్టిరియల్ గుణాలు ఉండడం వల్ల ఇవి మొటిమలను తగ్గిస్తాయని ఇన్పెక్షన్లు కాకుండా చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులకు మంచి గిరాకీ ఉందట. ఈ ప్రాంతాల్లోని పలువురు సబ్బులను కాకుండా ఏకంగా గాడిద పాలను తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ తరుణంలో ఒక్కో లీటర్ గాడిద పాలు వెయ్యి రూపాయలు ఖర్చు చేసి మరీ కొనుక్కొని తాగుతున్నారట.
ఇది కూడా చదవండి : వర్షాకాలంలో మీ చిన్నారులను దోమ కాటు నుంచి రక్షించడానికి చిట్కాలు ఇవే..!