రతిక రోజ్ బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. హౌస్ లోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రియా అలియాస్ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు సూచనల మేరకు ప్రియా కాస్త రతిక రోజ్ గా పేరు మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె స్వస్థలం మరెక్కడో కాదు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని వికారాబాద్ జిల్లా పెద్దేమున్ మండలం జనగాం గ్రామంలో పుట్టి పెరిగిన గ్రామీణ ప్రాంత రైతుబిడ్డ.
బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి జిల్లా ప్రజల మన్ననలు పొందింది రాతిక. ఈమె తండ్రి రాములు యాదవ్, తల్లి అనిత రాణి. వ్యవసాయం చేస్తూ క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు. ఈమెకి ప్రవళిక అనే ఒక అక్క, ధరణి అనే చెల్లెలు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు సంతానం. హీరోయిన్ గా రతిక మొదటగా పటాస్ ఫ్రీగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించింది. అలాగే కమెడియన్ బిత్తిరి సత్తితో కలిసి తీసిన తుపాకీ రాముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కార్తికేయ 2, నారప్ప, దృశ్య 2, ఇలా ఎన్నో సినిమాలలో నటించి తాజాగా బెల్లంకొండ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది.
Advertisement
Advertisement
ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది. రతిక రోజ్ తండ్రీ రాములు యాదవ్ సినిమా రంగంపై ఎంతో ఇష్టంతో తెలుగు నటుడు కావాలని చాలా ఆశలు ఉన్నా ఎన్నో ప్రయత్నాలు చేసినా కొన్ని కారణాలవల్ల నటన రంగానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చిందట. దీంతో ఆయన నటుడు కాకపోయినా తన కూతురి నటన కల నెరవేరిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే జిల్లా వాసులు రతిక బిగ్ బాస్ షోను ఫాలో అవుతూ అవకాశం వచ్చినప్పుడల్లా ఓటింగ్ చేస్తూ ఆమెకు అండగా ఉందామని జిల్లా వాసులు తెలియజేశారు.