Home » కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడనే విషయం మీకు తెలుసా..? 

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడనే విషయం మీకు తెలుసా..? 

by Anji
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఏదైనా ఉందంటే అది బింబిసార అనే చెప్పవచ్చు. ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కించడంతో సూపర్ విజయాన్ని అందుకుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఆగస్టు 05న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసార. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement

థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచిన బింబిసార ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ని రాబట్టింది. ఈ చిత్రంలో టైమ్ ట్రావెలింగ్ సబ్జెక్ట్ ని చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వశిష్ట.  అయితే ఈ సినిమా కథను తొలుత ఓ స్టార్ హీరోకు చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. మాస్ మహారాజా రవితేజ. కథ మొత్తం సిద్ధం చేసుకున్న తరువాత రవితేజకు వివరించాడట. రవితేజ ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడని.. ఇలాంటి కథలకు తాను సూటవ్వనని నిర్మొహమాటంగా చెప్పేశాడట.  

Advertisement

Also Read :  సావిత్రి చనిపోయే వరకు ఆ ఒక్క వస్తువు గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదట..ఏంటది..?

Manam News

దీంతో ఈ కథను నందమూరి కళ్యాణ్ రామ్ కి వినిపించగా.. ఆయన ఓకే చేయడంతో పాటు తన సొంత బ్యానర్ అయినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.వాస్తవానికి ఈ చిత్రాన్ని రవితేజ రిజెక్ట్ చేశారా లేదా అనేది క్లారిటీ తెలియాల్సి ఉంది. ఇక అదే సమయంలో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా విడుదలైంది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పవచ్చు. రవితేజ ధమాకా సినిమాతో మంచి హిట్ సాధించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. మరోవైపు కళ్యాణ్ రామ్ డేవిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. దీంతో పాటు బింబిసార 2 కూడా త్వరలో సెట్స్ పై వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 Also Read :  యాంకరింగ్ కి గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన సుమ..!

Visitors Are Also Reading