నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కృష్ణ జిల్లా నిమ్మకూరు ప్రాంతానికీ చెందిన ఈయన ఎంతో నటుడిగా, ఏపీ సీఎం దేశానికీ చేసిన సేవలు అనిర్వచనీయం. ఇక ఇప్పటికీ అతని కుమారులు, మనమలు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక అన్న ఎన్టీఆర్ గారి కుటుంబంపై ఓ చిన్న అపవాదు కూడా ఉంది. ఈ కుటుంబం నుంచి పురుషులు మాత్రమే సినీ రంగంలోకి రావడమేంటి..? మహిళలకు ఆ అవకాశాలిచ్చారా..? అనేది ఒక విమర్శ వినిపిస్తోంది.
వాస్తవానికి అప్పట్లో సినీ ప్రముఖులెవ్వరూ తమ పిల్లలను సినీ రంగంలోకి తీసుకొచ్చే వారు కాదు. ఈ ఫీల్డ్‌లో వ్యసనాలు ఎక్కువ అని, అవి వస్తే పాడైపోతారని ఓ అపవాదు ఉంది. కానీ ఎన్టీఆర్ మాత్రం నలుగురు కుమారులను సినిమాల్లోకి తీసుకొచ్చారు. నందమూరి రామకృష్ణ ఎడిటింగ్, సమర్పకులుగా ఉంటే.. హరికృష్ణ, బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిన విషయమే. నందమూరి మోహన్ కృష్ణ, కొన్నాళ్లు నిర్మాణ బాధ్యతలు చూశారు. ఆయన మరో కుమారుడు జయకృష్ణ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ దర్శకుడు రిజెక్ట్ చేశాడనే విషయం మీకు తెలుసా..?
ఎవరికీ అంతగా తెలియని విషయమేమిటంటే.. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఓ మహిళా ఒక సినిమాలో నటించింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఆమె మరెవ్వరో కాదు.. ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి. ఈమె శ్రీకృష్ణావతారం సినిమాలో బుల్లి కృష్ణుడి వేశంలో నటించారు. ఇక తరువాత కాలంలో మాత్రం ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ ఆమెను ప్రోత్సాహించాలని అనుకున్నప్పటికీ ఆయన సతీమణి బసవతారకం వారి చదువులు ఎక్కడ దూరమవుతాయోననే భయంతో పిల్లలను సినిమాల్లోకి రానివ్వలేదట. అలా ఎన్టీఆర్ కూతుర్లు సినిమాల్లోకి రాలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి : రష్మీపై ఫైర్ అయిన సుధీర్ అక్క..అసలు కారణం తెలిస్తే షాకవుతారు..!!