Home » ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?

ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?

by Anji

సాధారణంగా ప్రతీ ఒక్కరి జీవితంలో చిన్నప్పటికి సంబంధించి ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి. వాటిలో రకరకాలుగా ఉంటాయి. కొన్ని దొంగతనం, మరికొన్ని చిలిపిచేతలు, మరికొన్ని తల్లిదండ్రులతో దెబ్బలు తినడం వంటివి ఉంటాయి. మన జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పుడు తలుచుకుంటూ చాలా నవ్వుకుంటాం. అలాంటి ఘటనే ఒకటి మెగాస్టార్ చిరంజీవికి కూడా చోటు చేసుకుందట. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి షేర్ చేసుకున్నారు. 

Also Read :  దర్శకుడు శంకర్ నటించిన సినిమాలు ఏవో మీకు తెలుసా ?

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “తనకు సరిగ్గా 12 ఏళ్లు ఉన్న సమయంలో 6వ తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో ఏవీఎస్ సంస్థ వారు నిర్మించిన రాము అనే సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ కి అప్పట్లో పెద్ద ఫ్యాన్ కాfడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యాను. దీంతో ఎలాగో అలాగా సినిమా టికెట్ సంపాదించి నెల్లూరులోని  ఓ థియేటర్ లో సినిమా చూసి బయటికి వచ్చాను. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ కావడంతో రద్దీ బాగా ఉండటంతో సినిమా థియేటర్ వద్దకు వచ్చారు. ఆ తోపులాట లో నలిగిపోయిన నన్ను చూసి ఆక్షణం కోపంతో కొబ్బరి మట్ట చీరి కొట్టుకుంటూ నెల్లూరు కనకమహల్ థియేటర్ నుంచి మూన సెట్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. నాన్నకు ఆవేశం వస్తే.. అంతే ఆరోజు పిచ్చ కొట్టుడు కొడతారు.  

Also Read :  ANR: తెలుగు ఇండస్ట్రీ HYD రావడానికి చర్చ్ పార్క్ స్కూల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

Chiranjeevi

 

ఇప్పటికీ ఏవీఎం పేరు చెప్పినా రాము మూవీ గురించి చెప్పిన నాకు ఆరోజు మానాన్న కొట్టింది గుర్తుకు వస్తుందని చెప్పుకొచ్చారు చిరంజీవి. తన జీవితంలో జరిగిన ఈ ఫన్నీ సంఘటనను షేర్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని.. చెబితే పరువు పోతుందని అనుకుంటానని తెలిపారు చిరంజీవి. చాలా మంది ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే.. చాలా ఎక్సయిట్ అవుతుంటారు. కానీ తనకు మాత్రం కనుక మహల్ థియేటర్ గుర్తుకొస్తుంటుంది అని తెలిపారు చిరంజీవి.  చిన్నతనంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని.. ఆ సినిమా పిచ్చే నన్ను ఈరోజు మెగాస్టార్ అయ్యేవిధంగా చేసింది” అని చెప్పారు చిరంజీవి.  ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా అందరి జీవితాల్లోనే ఉంటాయి. కానీ కొందరూ మాత్రమే వాటిని తమ జీవిత పాఠాలుగా మార్చుకొని కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మిగతా వారు మాత్రం అలాగే ఉండిపోతారు. ముఖ్యంగా జీవితంలో ఎదగాలంటే.. కొన్ని గుణపాఠాలు మాత్రం తప్పనిసరి అని చెప్పవచ్చు. 

Also Read :   అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

Visitors Are Also Reading