Telugu News » Blog » ఆ అమ్మాయి వల్లే హీరో సుమన్ జైలుకు వెళ్లాడని మీకు తెలుసా..?

ఆ అమ్మాయి వల్లే హీరో సుమన్ జైలుకు వెళ్లాడని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేవుడి పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది హీరో సుమన్ మాత్రమే. ఇక వెంకటేశ్వర స్వామి పాత్ర చేయడంలో సుమన్ ను మించిన వారు ఉండరు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు ప్రాణం పోశారు. తులు కుటుంబానికి చెందినటువంటి హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. టాలీవుడ్ లో మొదట ఇద్దరు కిలాడీలు చిత్రంతో కెరియర్ ను మొదలుపెట్టి దాని తర్వాత తరంగిణి, త్రివేణి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించాడు.

Advertisement

 

అప్పట్లో తెలుగు వారి గుండెల్లో ఎంతో ఆదరాభిమానాలు సంపాదించుకున్న సుమన్ జీవితంలో ఒక సంఘటన కెరీర్ ను నాశనం చేసింది. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సుమన్ జైలుకు వెళ్లడం వల్ల అతని సినీ జీవితం అంతా క్లోజ్ అయింది. దానికి ప్రధాన కారణం ఆ ఒక్క అమ్మాయి.. ఆవిడ ఎవరు.. మరెలా జరిగిందో చూద్దాం.. అప్పట్లో సుమన్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. అలా సుమన్ ను ఒక డీజీపీ కూతురు లవ్ చేసింది. ఆయన షూటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఆమె వెళ్లేదట. కానీ సుమన్ పట్టించుకునే వారు కాదు. చివరికి ఆమె పెళ్లయినా కానీ సుమన్ చుట్టూ తిరగడం వల్ల సుమన్ రిజెక్ట్ చేయడంతో డిజిపి సుమన్ పై కోపం పెంచుకున్నాడు.

Advertisement

ఇక ఈ విషయం అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వద్దకు వెళ్ళింది. ఆయన హీరో సుమను పిలిచి మాట్లాడగా సుమన్ ఆ అమ్మాయికి చెప్పండి అంటూ ఎం జి ఆర్ కు తిరుగు సమాధానం ఇచ్చారట. దీంతో ఎంజీఆర్ చెన్నైలోని ఒక బిజీ సెంటర్లో సుమన్ గొడవ చేశారంటూ పోలీసులు కేసు పెట్టారు. అలా ఏడాది పాటు జైలు నుంచి బయటకు రాకుండా ఇరికించేశారు. అయితే సుమన్ వాళ్ళ అమ్మకు అప్పటి గవర్నర్ మంచి స్నేహితురాలు. దీంతో గవర్నర్ ద్వారా మాట్లాడి రెండు నెలలకే బెయిల్ ఇప్పించిందని డైరెక్టర్ సాగర్ ఆయన మరణించక ముందు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Advertisement

also read: