Home » చిరంజీవికి ఆ అభిమాని వశీకరణ చేశారని మీకు తెలుసా..?

చిరంజీవికి ఆ అభిమాని వశీకరణ చేశారని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈనెల 13వ తేదీన గ్రాండ్ గా థియేటర్లోకి రానుంది వాల్తేరు వీరయ్య.. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చాలా బిజీ అయిపోయారు.. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య మూవీ గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు.. అంతేకాకుండా తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను చెప్పారు.

Advertisement

Also read;మెగాస్టార్ కామెంట్స్ కి హర్ట్ అయిన కిరణ్ అబ్బవరం

అయితే గతంలో చిరంజీవిపై విష ప్రయోగం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక బర్త్డే కేక్ లో విషం కలిపి చిరంజీవికి తినిపించారు.. మరి అది తినిపించింది ఎవరు ఏమిటి అనే విషయంపై చిరంజీవి మాట్లాడుతూ.. ఒక అభిమాని చేసిన పిచ్చి పని అన్నారు.. మరణ మృదంగం సినిమా షూటింగ్స్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని , అప్పట్లో అభిమానులు డైరెక్ట్ గా వచ్చి కలిసే వారిని తెలియజేశారు. ఆరోజు ఒక ఫైట్ షూటింగ్ జరుగుతోంది. చాలామంది అభిమానులు వచ్చారు. కేక్ కూడా కట్ చేయించారు. అయితే కేక్ నేనెప్పుడైనా స్పూన్ తోనే తింటాను. చేతిలో పెడితే అసలు తినను.. కానీ ఆరోజు ఒక అభిమాని బలవంతంగా కేక్ నా నోట్లో పెట్టే ప్రయత్నం చేశారు..

Advertisement

అది నోట్లో పెట్టగానే చేదుగా అనిపించింది. వెంటనే బయటకు ఉమ్మేసాను. తర్వాత దాన్ని టెస్ట్ చేస్తే కేకులో ఏదో పౌడర్ కనిపించిందని గుర్తు చేసుకున్నారు. అయితే వెంటనే ఆ కేక్ ఇచ్చిన అభిమానిని పట్టుకొని అక్కడున్న వారు నాలుగు తగిలించారు. అందులో ఏం కలిపావని నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి మీ అభిమాన సంఘానికి అధ్యక్షుడిని. నన్ను కొద్దిరోజులుగా మీరు పట్టించుకోవడం లేదనే కోపంతో కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసిన పొడి తెచ్చి కేక్ లో కల్పానని చెప్పారు. అది తిన్నాక నేను గతంలో మాదిరిగా తనతో మాట్లాడతానని అనుకున్నాడు. ఇక చివరికి ఆ అభిమాని ఏదో మూర్ఖత్వంతో చేశాడని వదిలేసాను. అంతే తప్ప అది విష ప్రయోగం కాదని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

Also read;రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !

Visitors Are Also Reading