Telugu News » Blog » ఆర్ఆర్ఆర్ లాభాలు ఎన్నో తెలుసా…?

ఆర్ఆర్ఆర్ లాభాలు ఎన్నో తెలుసా…?

by Manohar Reddy Mano

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. పైగా ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు కావడంతో ఈ సినిమా పైన అంచనాలు మరి ఎక్కువయ్యాయి. కానీ సినిమా అనౌన్స్ తర్వాత కరోనా రావడంతో విడుదల ఆలస్యం అయింది. కానీ ఎట్టకేలకు అన్ని అస్సంకులను దాటుకొని మార్చ్ 24 న అభిమానుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విడుదల రోజు పాజిటివ్ టాక్ తెచుకున్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా అభిమానులను అలరించింది.

Ads

అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత కొంచెం నెగెటివ్ టాక్ వచ్చిన… రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కావడంతో అది కనిపించలేదు. ఇక ఇందులో ఎన్టీఆర్ కు కొంత అన్యాయం జరిగిందని నందమూరి అభిమానులు భావించారు. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. మొత్తం 8 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజలు నేటితో పూర్తి చేసుకుంది.

Ads

అయితే విడుదల అయిన 10 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్లు సాధించింది అని ప్రకటించారు నిర్మాతలు. అయితే ఇప్పటివరకు రాజమౌళి సినిమాలు ఏవి కూడా నిర్మాతలను నష్టాలను మిగిల్చలేదు. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా వల్ల నిర్మాతలకు 150 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. థియేట్రికల్ కలెక్షన్ల ద్వారానే ఈ లాభం దక్కినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అదే విధంగా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా 200 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జీ5 ద్వారా ఓటీటీలో ఈ నెల 20న రాబోతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!