Home » ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. అందరూ హీరోకి అభిమానులు ఉంటారు… కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టి మరీ రెండు మూడు సార్లు చూస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వానికి కూడా ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోనే టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ అధిక రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ రెమ్యునరేషన్ ఎక్కువగానే ఉన్నాకూడా ఆయనతో సినిమాలు చేయాలని నిర్మాతలు పోటీ పడుతుంటారు.

Advertisement

దానికి కారణం పవన్ సినిమా అంటే కచ్చితంగా మొదటి రోజు భారీ స్థాయిలో వసూలు వస్తాయి. సినిమా యావరేజ్ గా ఉన్నా కాసుల వర్షం కురుస్తోంది. అయితే ప్రస్తుతం 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు అనేది మాత్రం చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హీరోగా పరిచయం చేశారు.

బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ఖయామత్ సే ఖాయామత్ తక్ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ హీరోగా “అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే పవన్ మాత్రం ఈ సినిమాకు నెలకు ఐదు వేల రెమ్యునరేషన్ మాత్రమే అందుకున్నారట. సినిమా పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ కు మొత్తం 50 వేల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also read : రామ్ గోపాల్ వర్మ తన కూతురిని చూడకుండా 7 సంవస్సరాలు దూరంగా ఉన్నారట.. ఎందకంటే…?

Visitors Are Also Reading