Telugu News » Blog » నటి శ్రీరెడ్డి ప్రతి నెల సంపాదన ఎంతంటే ?

నటి శ్రీరెడ్డి ప్రతి నెల సంపాదన ఎంతంటే ?

by Anji
Ads

శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె అర‌కొర సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య ఆమె ఏ పోస్ట్ చేసిన‌ప్ప‌టికీ వైర‌ల్‌గానే మారుతుంది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో న‌టిగా కొన‌సాగడం కోసం హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో చాలా మంది చేదు అనుభ‌వం ఎదురు అయిది. ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న స‌మ‌యంలో చాలా మంది ఈమెను కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల‌కు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఈమె అప్ప‌టినుంచి తెగ పాపుల‌ర్ అయ్యారు. ఇక కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌ల‌తో ఏకంగా ఈమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి వేసి చెన్నై వెళ్లి స్థిర‌ప‌డ్డారు. చెన్నై లో ఉన్న‌టువంటి ఈమె ఎలాంటి సినిమాల్లో న‌టించ‌కుండా కేవ‌లం యూట్యూబ్ వీడియోల‌తో అభిమానుల‌ను సంద‌డి చేస్తున్నారు.

Ads

ఈ త‌రుణంలోనే యూట్యూబ్ మాత్ర‌మే కాకుండా ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతో మంది ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకున్న శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా నెల‌కు భారీగానే సంపాదిస్తుంద‌ని తెలుస్తోంది. తెలుగులో మాత్ర‌మే కాకుండా ఈమెకు త‌మిళంలో కూడా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ఉంది. తెలుగు యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఎన్నో ర‌కాల వంట వీడియోల‌ను చేస్తూ అభిమానుల‌ను సంద‌డి చేస్తున్నారు. ఈమె యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా చిన్న వీడియో షేర్ చేసిన క్ష‌ణాల్లోనే వైర‌ల్ అవుతోంది.

Ads

Also Read :  పవన్ కు అత్తగా నటించిన నదియా చిరంజీవికి జోడిగా నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది అన్న సంగతి తెలుసా…? ఏ సినిమా అంటే…!


ఇలా ఈ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఈమె భారీగానే సంపాదిస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి చెన్నైలో ఎంతో ల‌గ్జ‌రీ లైఫ్ గ‌డుపుతోంది. ఈమె ఇలా ల‌గ్జ‌రీ లైఫ్ గ‌డ‌ప‌డానికి భారీగానే ఖ‌ర్చు అవుతున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీ‌రెడ్డి కేవ‌లం యూట్యూబ్ ద్వారా మాత్రే నెల‌కు 7 నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం అందుకుంటుంద‌ని స‌మాచారం. ఇక‌పోతే శ్రీ‌రెడ్డికి ఓ రాజ‌కీయ పార్టీ మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని ఆ పార్టీ త‌రుపున ఫండ్స్ కూడా వెళ్తుంటాయ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఈ ఫండ్స్ విష‌యం గురించి క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఈమె సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం భారీగా సంపాదిస్తున్న‌ట్టు స‌మాచారం.

Ad

Also Read : ఏ హీరోకు సాధ్యం కానీ ప్ర‌పంచ రికార్డు సృష్టించిన నాగార్జున‌..!