Home » బిగ్ బాస్ లో మదర్ ఇండియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బిగ్ బాస్ లో మదర్ ఇండియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

బిగ్ బాస్ 6వ సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.  ప్రధానంగా ఎలిమినేషన్స్ లో ఈ సారి బిగ్ బాస్ మతిపోయే విధంగా ట్విస్ట్ లు ఇస్తున్నాడు. కంటెస్టెంట్స్ ఆకట్టుకోకపోతే ఏ మాత్రం ఉపేక్షించేది లేదని చెబుతున్నాడు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారిలో కొంత మంది టాప్ 5లో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేట్ అయ్యారు.  ఈ సీజన్ లో కొందరూ విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకోగా.. మరికొందరూ మాత్రం కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. బాలాదిత్య, వాసంతి, మెరీనా ఈ కోవకే చెందుతారు.

Advertisement

అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ అవేమీ వీరి ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేకపోయాయి. వీరు అంతటి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే 11 వారాలుగా ఇంట్లో వారందరి ఆకలి తీర్చి మదర్ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో సఖ్యతగా ఉంటూ మంచితనంతో మెలిగింది. గత కొద్ది వారాలుగా ఆటలోనూ ముందుంది. ఈమెకి బిగ్ బాస్ భారీగా ముట్టజెప్పారు. వారానికి 35వేల రూపాయల చొప్పున పారితోషికం అందించినట్టు తెలుస్తోంది. అలా 11 వారాలకు దాదాపు రూ.3,85,000 తీసుకుందట.

Advertisement

Also Read :   సూపర్ స్టార్ కృష్ణకు జయసుధ దగ్గరి బంధువు అని మీకు తెలుసా..?

Marina Abraham and Rohit Sahni TOP 10 Controversies, Unknown Facts Bigg Boss  Telugu 6 Contestant, Full Journey

అయితే హౌస్ లో ఏదో ఒకవిధంగా హైలైట్ అవుతుండాలి.కానీ ఆమె  కూల్ గా ఉండేందుకే ప్రయత్నించింది. దాదాపు అందరూ కూడా ఆమెతో పాజిటివ్ గా ఉన్నారు. కానీ చివరి వారం మాత్రం మిగతా కంటెస్టెంట్ తో సరిగ్గా పోరాడలేకపోయింది. ఇక మెరినా 11 వారాల పాటు ఉంటుందని ఎవ్వరూ కూడా అనుకోలేదు. తొలుత తన భర్తతో కలిసి వచ్చిన ఆమె నామినేషన్ లో కూడా ఇద్దరూ ఒక జంటగా నిలిచారు.  బిగ్ బాస్ మెరీనాకి ఒక విధంగా మంచి ఆదాయమనే చెప్పవచ్చు. తన కెరీర్ లో తొలిసారి హై రేంజ్ లో జీతం అందుకున్న ఈ బ్యూటీ మరో విధంగా క్రేజ్ అందుకుంది. ఎంటర్టైన్ మెంట్ లో తన కెరీర్ ని ఎలా మలుచుకుంటుందో వేచి చూడాలి.

Also Read :  సాయిపల్లవి హాస్పిటల్ నిర్మాణం చేయడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

Visitors Are Also Reading