Home » రామ్ జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడేలా ఉందో తెలుసా..?

రామ్ జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడేలా ఉందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే చెరువులోకి పాతనీరు పోయి కొత్తనీరు వచ్చినట్టు.. ఇండస్ట్రీలోకి ఎప్పుడూ కొత్త కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా స్టార్ డం ఉన్నప్పుడే హీరోయిన్లు కాస్త కూస్తో జీవితాన్ని సెట్ చేసుకోవాలి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి ఎంతోమంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. అలా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే స్టార్డం తెచ్చుకొని మళ్ళీ కనిపించకుండా పోయినవారు అనేకమంది ఉన్నారు. అలా ఈ హీరోయిన్ కూడా ఆ కోవకే చెందింది.

Advertisement

Also Read:“నువ్వు నేను” వసు గుర్తుందా.. తల్లయిన తరగని అందం..లేటెస్ట్ ఫోటోలు చూస్తే..!!

వివరాల్లోకి వెళితే.. ఆర్య లాంటి లవ్ స్టోరీ తో ఇండస్ట్రీని షేక్ చేసిన సుకుమార్ తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామందికి ఉంటుంది. అయితే ఆయన రామ్ తో జగడం అనే మూవీ తీశాడు. కానీ సినిమా థియేటర్లలో సరిగా వర్కౌట్ కాలేదు. కాని తర్వాత తర్వాత మాత్రం ఈ చిత్రానికి ఫాలోయింగ్ వచ్చింది. రాజమౌళి లాంటి డైరెక్టర్లు సైతం ఆ మూవీని మెచ్చుకున్నారు. అయితే మాస్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ సీన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇందులో ఈషా సహానిని హీరోయిన్గా తీసుకువచ్చారు. రామ్ తో ఈ బ్యూటీ చేసిన రొమాన్స్ మామూలుగా లేదు.

Advertisement

Also Read:బంగారం లాంటి అమ్మాయి.. 3 కోట్ల కట్నం..  తాళి కట్టడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

అమాయకంగా, చాలా క్యూట్ గా ఉన్న ఈశా ఈ సినిమాతో యూత్ ను ఆకట్టుకుంది. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగులో మరో చిత్రం చేయలేదు. తమిళంలో బ్యాడ్ బాయ్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపే చూడలేదు. కొంతకాలానికి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్లో సెటిల్ అయిపోయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు. అలాంటి ఈశా రీసెంట్ గా ఒక ఈవెంట్లో పాల్గొనడంతో ఆమె ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పుడు సినిమాలో చూసిన ఈశా కు ఇప్పటి ఈశాకు చాలా తేడా వచ్చింది. మరి ప్రజెంట్ ఈమె ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.

Also Read:మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!

Visitors Are Also Reading