Home » సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం అప్పట్లో ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా, మరో వెంకటేష్ మనవడిగా నటించిన బాల నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. మరి ఆ పిల్లాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఆ కుర్రాడి పేరు ఆనంద్ వర్ధన్. ఇప్పుడు ఈ పిల్లాడు పెద్దోడు అయ్యాడు..

Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లడం వల్ల సినిమాలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసిన ఆనంద్, సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. హీరో గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం లేదు కానీ సినిమాల్లో మంచి పాత్రల ఎంపిక కోసం ప్రయత్నం చేస్తున్నారట. దీనికోసం ఆడిషన్స్ కి వెళ్తూనే ఉన్నారట. ఒకవేళ తనకు నచ్చిన పాత్ర దొరికితే మాత్రం సినిమాల్లో చేయడానికి రెడీ అంటున్నారు ఆనంద్ వర్ధన్..

Advertisement

ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆనంద్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసినవారు చిన్న ఆనంద్ ఇంత పెద్దవాడు అయ్యారా.. హీరోకు ఏ మాత్రం తగ్గని లుక్కు ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరి ఈ ఆనంద్ ను మీరు కూడా చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading