Home » “సూర్యవంశం” సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇప్పుడెలా ఉన్నాడంటే ?

“సూర్యవంశం” సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇప్పుడెలా ఉన్నాడంటే ?

by Anji
Ad

బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ వర్దన్ అంటే మనకు ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు. కానీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే వెంటనే గుర్తుకొస్తాడు. ప్రేయసిరావే, మనసంతానువ్వే, మావిడాకులు, బాలరామాయణం, ప్రియరాగాలు, ను తదితర సినిమాల్లో నటించాడు ఆనంద్.  నేనున్నాను సినిమా తరువాత వెండి తెరకు దూరమయ్యాడు. 

Advertisement

 

ఆనంద్ వర్దన్ పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస ఆనంద వర్దన్. నేపథ్య గాయకుడు దివంగత పీబీ శ్రీనివాస్ మనమడు. ఆకాశవాణి అనే సినిమాలో హీరోగా నటించాడు. అతని తండ్రి ఫణిందర్ చార్టర్డ్ అకౌంటెంట్ . అతనికి తండ్రి చిన్నతనం నుంచే రామాయణం కథ వినిపించే వాడు. బాగా వినడంతో తిరిగి చెప్పగలిగేంత జ్ఞాపకం ఉండేది. బాల రామాయణం తీయడానికి నటుల కోసం వెతుకుతున్న గుణశేఖర్ దృష్టిలో పడ్డాడు. బాల రామాయణం సినిమాలో వాల్మీకి పాత్ర ఇచ్చారు. ఇక అదే  సినిమాలో బాల హనుమంతుడి పాత్రలో కూడా నటించాడు. ఆ సమయంలో అతని వయస్సు కేవలం ఐదేళ్లు మాత్రమే. తన తొలి సినిమా కూడా అదే కావడం విశేషం. 

Advertisement

Also Read :  “సింహాద్రి” సినిమాకి కథ ఎలా వచ్చిందో తెలుసా ?

Manam News

చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 25 సినిమాలలో నటించాడు ఆనంద్. 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేసినటువంటి ఆనంద్ ప్రస్తుతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటాడు. హీరో లుక్ లో స్టైలిష్ గా ఉన్న తన ఫోటోలను ఎప్పటికప్పుడు  పోస్ట్ చేసి ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నాడు. పి బీ శ్రీనివాస్ మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇప్పటికే తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి హీరోగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రధానంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న తేజ సజ్జ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆనంద్ వర్దన్ కూడా అదేవిధంగా సక్సెస్ అవుతాడో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :  మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. సినిమా ఏంటంటే..?

Visitors Are Also Reading