Home » గర్భిణీ స్త్రీలు ఏ నెలలో ఎలా పడుకోవాలో మీకు తెలుసా.. వైద్యులు ఏమంటున్నారంటే..!!

గర్భిణీ స్త్రీలు ఏ నెలలో ఎలా పడుకోవాలో మీకు తెలుసా.. వైద్యులు ఏమంటున్నారంటే..!!

Ad

పెళ్లి అనేది మన జీవితంలో గొప్ప కార్యం.. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఇంకా అనుభూతిని కలిగించే విషయం. కాబట్టి గర్భిణి స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా పడుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గైనకాలజిస్ట్ లు తెలియజేస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం..!! ఇందులో మూడు రకాలు ఉంటాయి.. 1-3 నెలల వరకు ఒక విధంగా..4-6 నెలల లోపు ఒక విధంగా..7-9 నెలల లోపు ఒక విధంగా పడుకోవాలి.
1-3 నెలలు :
ఈ సమయంలో గర్భిణీ స్త్రీలలో గర్భసంచి అనేది పై పొట్ట వరకు రాదు. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ విధంగా పడుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ బోర్లా పడుకోవడం మంచిది కాదు.

Advertisement

4-6 నెలల్లో :
ఈ సమయంలో గర్భాశయం అనేది బొడ్డు వరకు వస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు బోర్ల అసలే పడుకోకూడదు. కామన్ గా పడుకోవచ్చు. మిగతా ఏ సైడ్ అయినా పడుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఈ సమయంలో ముఖ్యంగా లెఫ్టు తిరిగి పడుకోవడం అనేది కొద్దిగా మంచిది. ఒకవేళ కొంతమందికి స్కానింగ్ లో లోపల బిడ్డకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisement

7-9 నెలలు :
ఈ సమయంలో గర్భాశయం అనేది పై పొట్ట వరకు వస్తుంది. బిడ్డ సైజు పెరగడం వల్ల తల్లి రక్తనాళాలపై ప్రెజర్ పడుతుంది. దీనివల్ల పాదాల నుంచి గుండె వరకు బ్లడ్ రీచ్ అవ్వకపోవచ్చు. దీనివల్లనే ఒక్కోసారి కాళ్ళ వాపులు వస్తాయి. అలాగే బిడ్డకు కూడా ప్లేజెంటా నుండి బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు లెఫ్ట్ సైడ్ లో తిరిగి పడుకోవాలి. కాకపోతే ప్రతిసారి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని ఏమీ లేదు. కామన్ గా పడుకుంటే బ్లడ్ ప్రెజర్ పై ఒత్తిడి ఏర్పడి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది. దీంతో వారంతట వారే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటారు. కాబట్టి లాస్ట్ మూడు నెలల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కువ ప్రిఫరెన్స్ లెఫ్ట్ సైడ్ పడిపోవడానికి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

( గమనిక: ఇది జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పబడింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. )

also read;

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంగ‌రాలు ధ‌రించ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

చెన్నై గెలుస్తున్నా.. ఏడుస్తున్న అభిమానులు…!

 

Visitors Are Also Reading