Telugu News » Blog » ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా ? 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా ? 

by Anji

నేచురల్ స్టార్ నాని గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 1984 ఫిబ్రవరి 24న కృష్ణాజిల్లాలో జన్మించాడు నాని. తన 38వ ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇవాళ నాని బర్త్ డే వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నాని అభిమానులు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే నాని ఓ స్టార్ గా ఎదిగాడు. తనకంటూ ఒక స్టైల్, ఇమేజ్, ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. నాని బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగాయి. ఈ క్రమంలో సినిమా మీదకు మనసు వెళ్లింది. చదువు పూర్తి కాగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 

దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ గా చేరాడు నాని. బాపు  తెరకెక్కించిన రాధాగోపాలం చిత్రానికి పని చేశారు. అదేవిధంగా దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అయితే హీరో కావాలని కొందరు ఆయనను ప్రోత్సహించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అష్టాచెమ్మా’ సినిలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన అష్టాచమ్మా చిత్రం మంచి విజయం సాధించింది. నాని, తనీష్ హీరోలుగా నటించిన  రైడ్ చిత్రంలో ‘దంచవే మేనత్త కూతురా సాంగ్ రీమేక్  లో నాని అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడు. ఇక స్నేహితుడు మూవీతో మరో హిట్ కొట్టాడు. దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది చిత్రం నానికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. నేచురల్ గా ఉండే నాని నటన ప్రేక్షకులకు చాలా  దగ్గరయ్యే విధంగా చేసింది. నాని హీరోగా పిల్ల జమిందార్, ఈగ  వంటి చిత్రాలు వరుస హిట్ అందించాయి.  దర్శకుడు రాజమౌళి ఈగ చిత్రంలో ఛాన్స్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. రాజమౌళి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈగ చిత్రం నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  ఇందులో అతని పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. అద్భుతమైన లవ్ ట్రాక్ తో ఆకట్టుకున్నాడు.  

Advertisement

Also Read :  బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్న స్టార్ దర్శకుడు ఎవరంటే..?

ఈగ తర్వాత నాని వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఒక దశలో కెరీర్ ముగిస్తుందేమో అని అనుకున్నారు. కానీ దర్శకుడు మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి  మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అనంతరం తనకు ఫస్ట్ మూవీలో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన జెంటిల్ మెన్ తో మరో హిట్ సాధించారు. ఇక ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళుతున్నాడు నాని. తాజాగా నాని నటిస్తున్న మూవీ దసరా చిత్రం విడుదలకు సిద్ధమైంది. మార్చి 30న దసరా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని ఊరమాస్ గ్లామర్ రోల్ చేయడం విశేషం. నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా దసరా విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మార్చి 30 వరకు ఎదురుచూడాల్సిందే.  

Also Read  :   అయ్యప్ప‌మాల‌లో అమెరికాకు చ‌ర‌ణ్…కానీ అక్క‌డ సూటు బూటు ఎందుకు వేసుకున్నాడంటే..?

You may also like