Telugu News » Blog » నిత్యానంద స్వామి ‘కైలాస’ దేశం ఎంతకు కొన్నాడో తెలుసా ? 

నిత్యానంద స్వామి ‘కైలాస’ దేశం ఎంతకు కొన్నాడో తెలుసా ? 

by Anji
Ads

స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన భారతీయ హిందూ గురువు. దేశ విదేశాల్లో ఆశ్రమాలు, గురుకులాలు దేవాలయాలను కలిగి ఉన్న ట్రస్ట్ నిత్యానంద జ్ఞానపీఠం వ్యవస్థాపకుడు. స్వామి నిత్యానంద అసలు పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. ఈయన అసలు పేరు  అరుణాచలం రాజశేఖరన్. ఆయనను అనుసరించి అనుచరులు నిత్యానంద పరమశివం, పరమహంస నిత్యానందాన్ని కూడా పిలుస్తారు. ఈయన తమిళనాడులోని తిరువన్నమలైలో అరుణాచలం, లోక నాయకి కీ జన్మించారు. ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ  నిత్యానందకై భారతీయ న్యాయస్థానాలలో **చారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు. 2019లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

Advertisement

Also Read :  మంచు మనోజ్ కి అనుచరుడిగా ఉన్న సారథి ఎవరో తెలుసా ? 

Advertisement

 

 

తర్వాత ఈక్వేడర్ సమీపంలో “కైలాస” అనే తన సొంత ద్వీపదేశాన్ని స్థాపించడం దానికి ఆయనే ప్రధాని అని తనకి తాను ప్రకటించుకున్నాడు. ఇదిలా ఉండగా..  ఇటీవల ఐక్యరాజ్యసమితిలో “కైలాస” దేశ ప్రతినిధిగా విజయ ప్రియ నిత్యానందా అనే అమ్మాయి హాజరు కావడం జరిగింది. రావటం మాత్రమే కాదు ఐక్యరాజ్యసమితిలో భారతదేశంపై.. ఈ నిత్యానంద శిష్యురాలు అనేకమైన ఆరోపణలు చేశారు. దీంతో భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐక్యరాజ్యసమితి… అసలు “కైలాస” దేశమే లేదు వేర్వేరు సంఘాల ప్రతినిధులతో UNలో మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై వ్యాఖ్యలు చేసినట్లు… వాళ్ళు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని ఐక్యరాజ్యసమితి భారత్ కి క్లారిటీ ఇచ్చింది. 

Also Read :  కేంద్ర ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!

Manam News

 

ఐక్యరాజ్యసమితికి వెళ్లిన అమ్మాయిని కైలాస దేశ శాశ్వత రాయబారి అని నిత్యానంద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత వైరల్ అయింది. ఇండియా కి చెందిన ఓ జాతీయ ఛానల్ కైలాస దేశం ఎక్కడ ఉంది అన్నదానిపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. “కైలాస” అనేది ఈక్వేడర్ లోనీ చిన్న ద్వీపం. దీనిని ఈక్వేడర్ నుంచి భారీ ధరకు నిత్యానంద కొనుగోలు చేయడం జరిగిందట. అయితే అంత డబ్బు నిత్యానందకి… కెనడాలోని ఆది శైవ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు విరాళాలు ఇవ్వటం జరిగిందనీ టాక్. ఇది చాలా చిన్న దివి వైశాల్యం కూడా తక్కువే అట. మరోపక్క నిత్యానంద “కైలాస” దేశానికి పాస్ పోర్ట్, ప్రత్యేక జెండాతో పాటు రాజ్యాంగం రూపొందించే పనిలో నిమగ్నమయ్యారట. తమ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకునే వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నట్లు ఇటీవలే ప్రకటన చేశారు నిత్యానంద. 

Advertisement

Also Read :  పాక్ లోనే ఆసియా కప్ – 2023 టోర్నీ… షాక్ లో ఇండియన్స్?

You may also like