సాధారణంగా హీరోలకు, డైరెక్టర్లకు ఇలా ఎవరికైనా సరే తొలుత సినీ రంగంలో ప్రవేశం చేసినప్పుడు పారితోషకం చాలా తక్కువ ఇస్తుంటారు. ప్రస్తుతం అయితే లక్షల్లో ఇవ్వగా.. గతంలో కేవలం వేలల్లోనే ఇచ్చేవారు. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తే మాత్రం పారితోషికం అమాంతం పెరిగిపోవడం ఖాయం. తొలి సినిమాకే డీసెంట్ అమౌంట్ పొందడం చాలా తక్కువ మందికే సాధ్యం అవుతుంది. అలాంటి లక్ నందినీ రెడ్డికే సొంతం అవుతుందనే చెప్పవచ్చు.
పదకొండేళ్ల క్రితం విడుదలైన అలా మొదలైంది..! సినిమాతో టాలీవుడ్ కి దర్శకురాలుగా పరిచయమైంది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే హిట్ దర్శకురాలుగా పేరు సంపాదించిన ఆమె ఆ తరువాత ఓబేబీతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఆమెకు అలా మొదలైంది సినిమాకు లభించిన పారితోషికం గురించి ఆమె రివిల్ చేశారు. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా మొదలైంది సినిమాకు తనకు పారితోషికం కింద రూ.5లక్షలు ఇచ్చారని.. ఆ సినిమా సూపర్ హిట్ అయి.. తమిళంలో రీమేక్ అయిన వేళ మాత్రం మరొక రూ.20లక్షలు నిర్మాత ఇచ్చారు అని చెప్పారు.
Advertisement
Advertisement
ఈ సినిమా కోసం రెండేండ్ల పాటు తాను కష్టపడ్డాను. ఓ దశలో సినిమా అసలు విడుదల అవుతుందా..? అనే సందేహంవచ్చేదని.. సినిమా విడుదలై సక్సెస్ సాధించిన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా సినిమా కోసం ఫైట్ చేసాను. ఓ దశలో ఈ సినిమా చేయలేననుకున్నా.. ఆపేద్దామనుకున్నా. ఆ సమయంలో శాటిలైట్ మార్కెట్ బాగుంది. మా సినిమాకు ఒకటిన్నర కోటిదాకా శాటిలైట్ ఆఫర్ వచ్చింది. మా బడ్జెట్ రెండున్నర కోట్లు. దాదాపు కోటి నష్టపోవడం ఖాయం. మా నిర్మాత వివేక్ ఏమి చెప్పారంటే.. మీరు సినిమా ఆపినా కోటి నష్టపోతారు. చేసేద్దాం సినిమా ఓ డైరెక్టర్ కంటిన్యూ అవుతుందన్నారు. దీంతో నిర్మాత దాము సరే అన్నారు.
ఇక సినిమాలో హీరో నాని చిన్న హీరో కావడం.. నిత్య మీనన్, నందనిరెడ్డి పెద్దగా తెలియకపోవడంతో తొలిరోజు ఎవరు వస్తారులే అని అనుకున్నట్టు చెప్పారు దర్శకురాలు. సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పడంతో మొదటి షోతోనే హిట్ టాక్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ థియేటర్‌లో సినిమా చూద్దాం అని వెళ్లితే.. 2వేల మందితో సినిమా చూడడం చూసి కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయి. ఆ నాటి తీపి గుర్తుల్ని గుర్తు చేసుకున్నారు నందినీ రెడ్డి.
Also Read :
సర్కారు వారి పాట తొలుత ఆ స్టార్ హీరో కోసమే సిద్ధం చేశారా..?
ఈ వారం ఓటిటి, థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే…!